Movies

టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాని దీక్ష సేథ్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

దేనికైనా లక్కు ఉండాలని అంటారు. ఎన్ని వున్నా ఆవగింజంత లక్ లేకుంటే ఇబ్బందే అంటారు మరి. ఇంతకీ ఇదంతా ఎందుకంటే ఇండస్ట్రీలో నార్త్ ఇండియా పొడగరి ముద్దుగుమ్మ దీక్షా సేత్ విషయం చూస్తే ఇదే అర్ధం అవుతుంది. నిజానికి దివ్యభారతి పోలికలతో ఉండే దీక్షా సేత్ ఎంత స్పీడుగా వచ్చిందో అంతే వేగంగా తెరవెన్నక్కి వెళ్ళిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్,రాశికన్నా,కీర్తి సురేష్ ల కన్నా ముందే టాలీవుడ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ అదృష్టం కలిసి రాలేదు. నిజానికి వేదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైనప్పుడు ఓ స్టార్ హీరోయిన్ వచ్చిందని అందరూ సంబరపడ్డారు. అది ఎన్నాళ్ళో నిలవలేదు.

వేదం హిట్ కావడంతో విమర్శకుల మెప్పు పొంది మిరపకాయ్, వాంటెడ్,రెబెల్ వంటి చిత్రాలతో యువతరం గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఈ బ్యూటీ’నిప్పు,ఊ కొడతారా ఉలిక్కి పడతారా’వంటి చిత్రాలు ప్లాప్ కావడం , పైగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఆరోపణల నేపథ్యంలో తెలుగుతెరకు దూరమైంది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన ఈ భామ కన్నడంలో జగ్గూ దాదా లో నటించి సౌత్ ఇండియాలో నిలదొక్కుకోవాలని ప్రయత్నించింది.

2016లో వచ్చిన ఈ మూవీ మంచి పేరు తెచ్చినా, అదే సమయంలో బాలీవుడ్ లో చేసిన మూవీ ప్లాప్ కావడంతో సౌత్ ఇండియాపై దృష్టి సారించింది . చూడ్డానికి అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నెంబర్ వన్ అవుతుందని భావించినా దురదృష్టం వెంటాడింది.
ఢిల్లీలో పుట్టిన ఈ సొగసరి భామ, తండ్రి ఉద్యోగ కారణంగా వివిధ ప్రదేశాల్లో తిరగడం వలన ఆయా సంస్కృతులను తెలుసుకొనే ఛాన్స్ లభించింది.

2009లో డిగ్రీ ఫస్టియర్ చదువుతూ మిస్ ఇండియా పోటీలో పార్టీసీపెట్ చేసి ,అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో వెతుకుంటూ వచ్చిన మోడలింగ్ లో నటిస్తూ, ఓ యాడ్ లో చేయడానికి హైదరాబాద్ రావడంతో, ఆమెను చూసిన క్యాస్టింగ్ డైరెక్టర్ దర్శకులు క్రిష్ కి చెప్పాడు. ఆవిధంగా వేదం మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

రవితేజ, ప్రభాస్,గోపీచంద్ వంటి స్టార్ హీరోలతో నటించింది. అయితే ఓ నిర్మాత ఆమెను క్యాస్టింగ్ కౌచ్ పేరిట వేధింపులకు గురిచేసాడని తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది. మళ్ళీ తెలుగు గడపలో అడుగుపెట్టని దీక్షా, ప్రస్తుతం మలయాళ మూవీలో నటిస్తోంది. ఈ మూవీతో పూర్వ వైభవం వస్తుందని ఆమె ఆశతో వుంది.