సంచలన నిర్ణయం తీసుకున్న సుధీర్… రేష్మీ కోసం….ఒప్పుకుంటుందా?
ఇటు టాలీవుడ్ అయినా, అటు బాలీవుడ్ అయినా, టివి షోస్ అయినా సరే కొందరి రిలేషన్స్ ఎంతకీ ఎవరికీ అర్ధం కావు. ఎందుకంటే అక్కడ జరిగే కెమిస్ట్రీ అలాంటిది. అందులో ప్రముఖంగా యాంకర్ రష్మీ గౌతమ్,కంటెస్టెంట్ సుధీర్ మధ్య నడిచే తంతు కూడా అలాంటిదే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే జబర్దస్త్ షో తో ఎంతో ఎదిగి, సినిమా రంగంలో కూడా తమ సత్తా చాటుతూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ఇద్దరు కళాకారులు నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. జబర్దస్త్ షో లో యాంకర్ గా రష్మీ ,ఆర్టిస్ట్ గా సుడిగాలి సుధీర్ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు.ఇక వీళ్ళిద్దరూ ఆ షోలో ఉంటే చాలు దాని TRP ఆకాశాన్ని అంటుతుంది.
దానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేకపోయినా, వాళ్ళ మధ్య అర్ధంకాని కెమిస్ట్రీ మాత్రమేనని చెప్పవచ్చు. ఆ కెమిస్ట్రీ ఏంటనేది అర్ధంకాక, టివి చానల్స్ వాళ్ళేకాదు,అభిమానులు కూడా జుట్టు పీక్కుంటారు. వీళ్లద్దరూ గాఢ ప్రేమికులైనా సరే, వారి కెరీర్ కోసం చాలా జాగ్రత్త పడుతుంటారని టాక్.
ఈ మేరకు ఎన్నో కథనాలు వచ్చాయి కూడా. ఎందుకంటే వీరిద్దరూ కలిసినప్పుడు వాళ్ళ ప్రవర్తన గమనిస్తే, ఎవరైనా సరే వాళ్ళిద్దరినీ లవర్స్ అనుకుని తీరాలి. ఇక తాజాగా ఓ డాన్స్ షోలో ఇద్దరూ ఉండగా,అందులో యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నకు సుధీర్ ఏం చెప్పాడంటే,’రష్మీ అంటే ఇష్టమా అని అడిగితే ఏమి చెబుతాను,అయినా చందమామ అంటే ఇష్టమా అంటే ఏమి చెబుతాం, రష్మీ కూడా.
అయితే ఆ చందమామ కైనా మచ్చ ఉంటుందేమో గానీ నా రష్మీ కి ఉండదు’అని చెప్పడం ద్వారా రష్మిని పొంగిపోయేలా చేసాడు. దీనికి రష్మీ కంటతడి పెట్టడంతో అందరూ ఎమోషన్ కి గురయ్యారు. ‘నేను చనిపోతే రష్మీ ఏడుస్తుందో లేదో గానీ ఆమె ఏడిస్తే నేను చచ్చిపోతాను’అని సుధీర్ భావోద్వేగ భరితంగా చెప్పాడు.
దీనికి రష్మీ తో సహా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఇక సుధీర్ అన్నమాటలు రష్మీ చాలాసేపు ఎమోషన్ నుంచి తేరుకోలేదు. ‘రష్మీ లేకపోయినా ఆమె ఉంటే చాలని బతికేస్తున్నా . ఆమె సంతోషమే నా సంతోషం. నిజానికి రష్మీ కన్నీరు పెట్టిందంటే ఆరోజే నేను చచ్చిపోయినట్టు’
అని తన గుండెల్లోని ప్రేమనంతా ఒలకబోశాడు. ఇంకేముంది రష్మీ కూడా దీనికి ఎంతో చలించిపోయిందట.