Movies

ఎలిమినేట్ అయినా కిరీటి వెళుతూ ఎంత పని చేసాడో… ఎవరు ఊహించలేరు

జోష్ ఫుల్ గా నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మరింత సందడిగా సాగుతూ, మూడవ వారం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నాని ఆదివారం రావడం రావడం సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి, హౌస్ మెంబర్స్ ని ఆశ్చర్య పరిచాడు. ఈ సందర్బంగా ఇంటి మెంబర్స్ తో ‘అవునన్నా కాదన్నా టైటిల్ తో ఓ సరదా గేమ్ ఆడించాడు. ఇంటి సభ్యులకు సూటయ్యేలా పలు సినిమాలు టైటిల్స్ ఇచ్చి,వాటిని వాళ్ళు చూడకుండా చెప్పించాడు. ఇక సామ్రాట్, తేజస్వి ,తనీష్,, దీప్తి సునయన లమధ్య సాగుతున్న ఇన్ సైడ్ లవ్ ని కూడా నాని బహిర్గతం చేసేసాడు. తప్పు చెప్పిన వారికీ ఇచ్చిన పనిష్ మెంట్ టాస్క్ లో సామ్రాట్ ఓ చిన్న పిల్లాడిగా నటించి అలరించాడు. ఇక డాన్స్ చేయమని పనిష్ మెంట్ రావడంతో దీప్తి సునయన పాట పాడుతూ ఉంటే తనిష్క్ డాన్స్ చేసి అలరిస్తే, రోల్ రైడా కూడా భరత నాట్యంతో షోను మరింత హుషారెత్తించాడు.

కీలకమైన ఎలిమినేషన్ రౌండ్ రావడంతో శనివారం మిగిలిన గణేష్, గీతామాధురి,కిరీటీలలో ఎవరు ఎలిమినేటి అవుతారో నాని సస్పెన్స్ కొనసాగించాడు. అయితే సేఫ్ కంటెస్టెంట్ గా గీతామాధురి నిలిచిందని నాని ప్రకటిచడంతో ఆమె ఎలిమినేషన్ నుంచి బయట పడింది. అది సరే, ఇక గణేష్,కిరీటీలలో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే విషయంలో వాళ్లలో పాజిటివ్ , నెగిటివ్ లను నాని వివరించాడు.

అయితే తక్కువ ఓటింగ్ తో కిరీటి ఎలిమెంట్ అయ్యాడని ప్రకటించడంతో సామాన్యుడు గణేష్ సేఫ్ జోన్ లోకి వచ్చేసాడు. ఇలా కిరీటి వెళ్లిపోవడంతో హౌస్ లో అదోరకమైన ఉద్వేగ వాతావరణం రాజ్యమేలింది. కిరీటి బయటకు వచ్చేటప్పుడు అందరూ ఆప్యాయంగా సాగనంపారు. ఇక కిరీటి మీద నిందలను తొలగించడానికి నాని అతన్ని బోనులో నిలబెట్టారు.

కౌశల్ ని కెప్టెన్సీ టాస్క్ లో ఏడ్పించడమే కిరీట్ ఎలిమినేటి కి కారణమని, ఆ ఒక్క ఇన్సిడెంట్ లేకుంటే ఇలా వెళ్లాల్సి వచ్చేది కాదని నాని వివరించాడు.అదేసమయంలో కిరిటీ మంచోడని హౌస్ మెంబర్స్ చెప్పుకొచ్చారు. తనకు జాకెట్ ఇచ్చిన కిరీటి మంచితనం గురించి చెబుతూ,తనిష్క్ ఎమోషన్ కి గురి కాగా,వైరం ఉన్నాసరే కిరీటి మంచితనం గురించి తనిష్క్ వివరించాడు.

యజమానుల టీమ్ లో చేసిన ఓ పనిని ఉదహరిస్తూ కిరీటి ఎంత మంచోడో బాబు గోగినేని చివరిగా వివరించారు. మొత్తం మీద కిరీటి పై పడిన మచ్చను ఈవిధంగా హౌస్ మేట్స్ తో నాని తొలగించాడు. ఇక కీలకమైన బిగ్ బాంబ్ వంతు రావడంతో హౌస్ లో ఒకరిపై బిగ్ బాంబ్ వేయాలని కిరీటిని నాని ఆదేశించాడు.

బిగ్ బాంబ్ సమయంలో బాత్ రూమ్ లో తప్పితే మొత్తం మీద బాక్సింగ్ గ్లౌజ్ లు వేసుకునే ఉండాలని నాని శిక్ష విధించాడు. ఇక కిరీటి వెళ్ళిపోతూ గీతామాధురిపై బాంబ్ వేయగా, స్పోర్టివ్ గా తీసుకున్న ఆమె శిక్షకు సిద్ధమని ప్రకటించడంతో ఆదివారం రౌండ్ సరదాగా ముగిసింది