Politics

రోజా సైలెంట్ వెనక మాస్టర్ ప్లాన్… ఆ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు

ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా సంచలనం సృష్టించి, హఠాత్తుగా సైలెంట్ అయిపొయింది. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా డేరింగ్ అండ్ డాషింగ్ గా నిరూపించుకున్న రోజా,అధికార పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రత్యర్థులపై విరుచుకు పడడం ఆమె స్పెషాలిటీ. కొత్త తరం పొలిటీషియన్స్ లో చెప్పుకోదగ్గ పేరు తెచ్చుకున్న ఈమె వైస్సార్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ధాటిగా మాట్లాడ్డమే కాదు, ఎదుటివారిపై మాటలతో దాడి చేయడమే ఆమె స్టైల్. ఇదే ఆమెను మిగిలిన వాళ్ళ కన్నా ప్రత్యేకంగా నిలబెట్టిందని అంటారు.

అసలు సినీ రంగం నుంచి వైదొలిగాక, బుల్లితెర మీదకు వచ్చి పలు కార్యక్రమాల ద్వారా రోజా తనదైన శైలిని ప్రదర్శించింది. అది టాప్ షో కావచ్చు,గేమ్ షో కావచ్చు ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. అయితే ఎమ్మెల్యే రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జగన్ సారధ్యంలోని వైస్సార్ కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా వ్యవహరిస్తున్న ఆమె, అధికార టిడిపి నేతలపై విరుచుకు పడే సమయంలో వాడే భాషపై తీవ్రంగానే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అసెంబ్లీలో సైతం ఆమె చేష్టలను తప్పుపడుతున్న వాళ్ళు ఎక్కువమంది వున్నారు. అందుకే ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయింది ఆ మధ్య. ఇక నంద్యాల ఉపఎన్నికల సందర్బంగా రోజా చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీనుంచి వ్యతిరేకత వ్యక్తమయినట్లు వార్తలొచ్చాయి. మంత్రి భూమా అఖిల ప్రియ డ్రెస్ కోడ్ గురించి చేసిన వ్యాఖ్య పెద్ద దుమారం రేపింది.

అయినా సరే పంధా ఏమాత్రం మార్చుకోకుండా ప్రత్యర్థులపై మాటలతో దాడులు కొనసాగిస్తోంది. అయితే జగన్ కూడా ఈవిషయంలో రోజాను కొంచెం తగ్గమని సూచించాడట. ఇక రోజా పర్సనల్ వ్యవహారాల్లో తలపెట్టని ఆమె భర్త సెల్వమణి కూడా ‘ఇలాంటి మాటలతో, చేష్టలతో మంచి రాజకీయ నాయకురాలివి ఎలా అనిపించుకుంటావ్’ అని మందలిస్తూ గట్టిగానే క్లాస్ ఇచ్చాడట.

చివరకు భర్త నుంచి కూడా వ్యతిరేకత రావడంతో వచ్చే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరితో శతృత్వాలు పెంచుకోకుండా అందరితో మంచిగా ఉండాలని రోజా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ఎవరిమీదా ఇకమీదట వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని, నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని తద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు బాట పట్టాలని ఆమె నిర్ణయించుకుందట.

పార్టీ ఆదేశించేవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అనుకోవడంతో కొన్ని రోజుల నుంచి రోజా నోటా సంచలన వ్యాఖ్యలు రావడం లేదు. ఇక నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో నగరి నియోజక వర్గంలో సొంత ఇల్లు కట్టుకుని, ఇటీవలే గృహప్రవేశం కూడా చేసింది.

వచ్చే ఎన్నికల వరకూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పక్కన పెట్టేసి, ఎవరిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని రోజా తీసుకున్న నిర్ణయం పట్ల సొంతపార్టీలోనే హర్షం వ్యక్తం అవుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి సీఎం అయితే రోజాకు కీలక మంత్రి పదవి లభిస్తుందని, అందుకే ఇప్పటినుంచే వివాదాల జోలికి పోకుండా వ్యహాత్మకంగా వ్యవహరిస్తోందని సొంత పార్టీలోని మరో వర్గం వాదన.