బాల నటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన రాశి ప్రస్తుత పరిస్థితికి కారణం ఆ స్టార్ హీరో?

టాలీవుడ్ లో చాలామంది బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి, పరిశ్రమలో స్టార్ గా రాణించిన వాళ్ళు చాలామందే వున్నారు. అందులో ముఖ్యంగా హెవీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశి ఒకరు. ఈమెకు తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నిజం మూవీలో ఈమె లేడీ విలన్ గా నటించి మరో చరిత్ర సృష్టించింది. దర్శకుడు తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో అసలు ఈ రోల్ భయ పెట్టిన తీరుకు అప్పట్లో అందరూ హేట్సాల్ఫ్ చెప్పారు. ఇక అన్నిరకాల రోల్స్ పోషించిన రాశి, గోకులంలో సీత,శుభాకాంక్షలు చిత్రాలతో హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకుంది. అన్నిరకాల పాత్రలతో మెప్పించిన ఈమె ఎందుచేతనో స్టార్ డమ్ కి దగ్గరలో ఆగిపోయి, చిన్నచిన్న చిత్రాలకే పరిమితం అయింది.

ఇంకా చెప్పాలంటే, పెళ్లి పందిరి, సందడే సందడి, ప్రేయసి రావే వంటి చిత్రాలతో రాశి సక్సెస్ ఫుల్ రేంజ్ కి ఎదిగినా, అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకోలేకపోయింది. అయితే మిడ్ రేంజ్ నటుల పాలిట అందాల దేవతగా నిల్చింది. కెరీర్ డవలప్ అవుతున్న సమయంలో శ్రీనివాస్ అనే అసోసియేట్ డైరెక్టర్ తో సెట్స్ మీద ఉండగానే ప్రేమలో పడి, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుని, వెండితెరకు దూరమైంది.

పెళ్లి తర్వాత చెన్నైలో సెటిల్ అయిన రాశి, 2014లో ఓ పాపాయికి జన్మనిచ్చింది. ఆపాపకు రిథిమా అనే పేరు పెట్టుకుంది. పెళ్లి తర్వాత పరిస్థితి బాగుటుందని అనుకున్నారు. అయితే, భర్త శ్రీనివాస్ ని ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు తాను నిర్మాతగా మారడం, ఆర్ధికంగా కుంగిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ కి ట్రై చేసింది.

అది కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఇక అప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ ని కల్సి అతను ఇచ్చిన సలహాతో మణికొండలో ఓ ప్లే స్కూల్ నడిపింది. అయితే అదృష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు అన్నట్లు రాశి పరిస్థితి తయారైంది. ఆమె స్కూల్ లో చేరిన నటుడు శివబాలాజీ కొడుకు ఓ రోజు ఒంటిపై గాయాలతో ఇంటికి రావడంతో శీను రివర్స్ అయింది.

ఎందుకంటే, ‘స్కూల్ నడపడం చేతకాకపోతే మూసేసుకోండి’అంటూ రాశిపై శివబాలాజీ దంపతులు ఫైర్ అయ్యారట. అంతటి వదలకుండా ఆమె స్కూల్ లో క్రమశిక్షణ లేదని షోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో ఉన్నకొద్దిమంది పిల్లలు మానేశారు. ఇంకేముంది, ఆ దెబ్బతో రాశి పరిస్థితి దిగజారిపోయిందట.

అప్పటికే విపరీతంగా లావెక్కిన రాశి, ఇలా ఉంటే ఇబ్బంది అని భావించి,లావు తగ్గే టెక్నీక్స్ ఫాలో అవ్వడం ద్వారా సన్నజాజి తీగలా మారిపోయింది. ఇక ఇటీవల కనీవినీ విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం రంగమ్మత్త పాత్రకు మొదట రాశినే పెట్టాలని అనుకున్నారట. అయితే చివరి నిమిషంలో ఆ పాత్ర కాస్తా అనసూయ ఎగరేసుకు పోయింది.

దీంతో రాశి నిరాశకు లోనైనా, మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తానన్న విశ్వాసంతో వుంది. అందుకే తన ప్రయత్నాలు . తెలుగులో తనకు తగిన పాత్రలు ఇస్తే, నూటికి నూరు శాతం వాటికి న్యాయం చేస్తానని చెబుతున్న రాశిని అదృష్టం వరించనుందా? వేచి చూద్దాం.