బ్రహ్మానందం ఆస్థి విలువ తెలిస్తే టాప్ హీరోలకు సైతం నిద్ర పట్టదు

ప్రముఖ హాస్య నటుడు రేలంగి హయాంలో హీరోలకన్నా రేలంగి కి ఎక్కువ డిమాండ్ ఉండేదని,రెమ్యునరేషన్ కూడా ఎక్కువేనని అంటుండేవారు. అయితే అదేమో గానీ ఈ తరంలో అలాంటి ఆహాస్య నటుడు వున్నాడా అంటే ఖచ్చితంగా చెప్పే పేరు బ్రహ్మానందం. అవును బ్రహ్మి గా షార్ట్ కట్ లో పిల్చుకునే బ్రహ్మానందం టాలీవుడ్ ని నిన్నటివరకూ అలానే ఏలాడు. అగ్రహీరోలు సైతం తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాలనే నిబంధన పెట్టి అతడు లేకపోతే సినిమాలు చేయం అనే సందర్భాలు కూడా లేకపోలేదు. దీన్ని బట్టి బ్రహ్మానందం రేంజ్ ఏమిటో వేరే చెప్పక్కర్లేదు. ఇక చిన్న సినిమాల్లో సైతం బ్రహ్మానందం ఉంటే చాలు మినిమమ్ రిజల్ట్స్ ఖాయమని అతడి కోసం వెయిట్ చేసేవారు నిర్మాతలు.

మొత్తమ్మీద టాలీవుడ్ బ్రహ్మానందం హాస్యం కమ్మేసింది. అతను తెరమీద కనిపిస్తే చాలు అభిమానులు కడుపుబ్బా నవ్వేవారు. చిన్న చిన్న పాత్రలు చేసిన బ్రహ్మానందం టాలీవుడ్ అత్యధిక సినిమాలు చేసిన హాస్యనటుడు స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు ఏ హీరోకి లేని స్థాయిలో క్షణం తీరికలేకుండా బిజీ ఆర్టిస్ట్ గా బ్రహ్మానందం వెలిగాడు.

ఇక పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉండేది. ఎందుకంటే, గంటకు రూ 5లక్షలు తీసుకునేవారని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక అతడి సంపాదన గురించి ఓ ఆంగ్ల పత్రిక ఇచ్చిన వివరాలు చుస్తే, ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం. జూబిలీ హిల్స్ లో ఇంద్రభవనం లాంటి ఖరీదైన ఇల్లు, హైదరాబాద్ ఔట్ కట్స్ లో ఫామ్ హౌస్, ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని అతడి సొంత ఊళ్ళో ఎకరాలకు ఎకరాలకు పొలాలు అతడి సొంతం.

అంతటితో ఆగకుండా, లేటెస్ట్ గా వచ్చిన ఏ కారు అయినాసరే అతడి ఇంట్లో ఉండాల్సిందే. ఆడి అరైట్,ఆడి క్యూ సిక్స్, మేస్టిజ్ బెంజ్ లాంటి కార్లు ఎన్నో అతడి ఇంట కనిపిస్తాయి. ఇలా అతడి ఆస్థి 320 కోట్ల రూపాయలకు పైనే వుంటుందని అంచనా.మెగా స్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయ్ సినిమాలో ఒక్క నిడివి లేని పాత్రలో నటించిన బ్రహ్మానందం ఏకంగా వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఎక్కారు. అయితే ఒకప్పుడు తినడానికి కూడా ఖాళీ లేనంతగా బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన బ్రహ్మానందం ఈ మధ్య ఒక్కసారిగా డౌన్ లోకి వచ్చేసారు.

సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం ద్వారా,ఎందరో కమెడియన్స్ మార్కెట్ లోకి రావడంతో బ్రహ్మానందానికి సహజంగానే డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా బ్రహ్మానందం కి ఇచ్చే రెమ్యునరేషన్ పెడితే ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ ని పెట్టుకోవచ్చనే భావించడం కూడా మరో కారణం.

అడపాదడపా సినిమాల్లో కనిపిస్తిన్న బ్రహ్మానందం ఇంట్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ,ఖరీదైన జీవితం, క్వాలిటీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు దశబ్దాల పాటు కామెడీ కింగ్ గా తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన కామెడీ కింగ్ బ్రహ్మానందం తెలుగు వారందిరికీ ఆదర్శం,గర్వకారణం.