Movies

లవ్ టాస్క్ లో దీప్తిని చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన దీప్తి భర్త

టెలివిజన్ ప్రేక్షకులకు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని,ఫుల్ జోష్ తో నడుస్తోంది. నాల్గవ వారానికి చేరుకున్న నేపథ్యంలో ప్రేమ టాస్క్ లు బిగ్ బాస్ హౌస్ లో హుషారెత్తిస్తున్నాయి. ఇక కౌశల్,దీప్తి లవ్ ట్రాక్ సూపర్బ్ అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ గా వుండే కౌశల్, ఇక ఎప్పుడూ ఏమీ చేయని దీప్తి వీరిద్దరూ ప్రేమాయణంలో మునిగిపోవడం తో అందరూ నిజంగానే షాక్ అయ్యారు.ఇద్దరూ అనుకుని పక్కా ప్లాన్ తో చేసిన లవ్ ట్రాక్ లో దీప్తి లవర్ గాళ్, కౌశల్ లవర్ బాయ్ గా కిక్కేంచేలా చేసారు. అందరికీ వీరి లవ్ పర్ ఫార్మెన్న్స్ అందరినీ ఆకట్టుకుంది.

మెచ్చుకున్నారు కూడా.ఇక దీప్తి పర్సనల్ గా వస్తే దీప్తి టీవీ9 న్యూస్ రీడర్ గా అందరికీ తెలుసు. న్యూస్ రీడర్ అంటే ఏదో సీరియస్ గా ఉంటుందేమో అని అందరూ అనుకున్నప్పటికీ సరదాగా డాన్సులు చేస్తూ, జోకులు పేలుస్తూ అందరినీ అలరిస్తోంది. ఒకవేళ ఎవరైనా బాధగా ఉంటే, ఏమిటని ఆరా తీసి, ఓదార్చి, సమర్దిస్తుంది.

మరి ఇలాంటి సమయంలో దీప్తికి లవ్ టాస్క్ ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.శ్యామలను సెక్యూరిటీ గార్డుగా ఉంచేసి, కౌశల్ కి దీప్తిని లవర్ గా ఉంచారు. అయితే దీప్తి లవ్ టాస్క్ చేసిన తీరుపై వాళ్ళ ఆయన కూడా బానే రెస్పాండ్ అయ్యారు. దీప్తిని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందని,అసలు ఎప్పుడూ దీప్తిని ఇలా చూడలేదని అందుకే లవ్ ట్రాక్ ఫర్ ఫార్మెన్స్ తో మంచి ఎంటర్ టైన్ చేస్తోందని దీప్తి హజ్ బ్యాండ్ శ్రీకాంత్ ఆనందంతో చెప్పాడు.

అంతేకాదు దీప్తికి వాళ్ళ ఆయన శ్రీకాంత్ సపోర్ట్ ఇస్తూ, అందరినీ ఓటెయ్యమ్మని అడుగుతున్నారు. దీప్తి లవ్ టాస్క్ ని శ్రీకాంత్ చాలా మెచ్చుకున్నట్లు టాక్