Movies

YOUTUBE షేక్ చేస్తున్న మహాతల్లి జాహ్నవి గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అసలు ఎవరీ మహాతల్లి అనుకుంటున్నారా ?అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మీడియా రంగంలో దూసుకుపోతున్న సోషల్ మీడియా ఇప్పుడు స్వశక్తిపై నిలబడాలనుకునే యూత్ కి మంచి ఛాన్సులు అందిస్తోంది. ఫేస్ బుక్,ట్విట్టర్, వాట్సాప్ వంటివి ప్రచారానికి విస్తృతంగా వేదిక అయ్యాయి. ముఖ్యంగా వెబ్ సైట్స్,వెబ్ ఛానల్స్ , యూట్యూబ్ ఫిలిమ్స్ ఇలా ఎన్నో రకాల ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. నాలుగు డబ్బులు సంపాదించాలంటే అందుకు యూట్యూబ్ నిజంగా కొందరికి కల్పతరువుగా మారిందనే చెప్పాలి. అందుకే నూతన ఆవిష్కరణలు, వినూత్న ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. అందులో మహాతల్లి ఒకరు. ఈమె అసలు పేరు జాహ్నవి దాశెట్టి.మీకొక ఐడియా వస్తే, దాన్ని యూట్యూబ్ లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేయగలిగితే తిరుగులేని పొజిషన్ కి చేరుకోవచ్చని మహాతల్లి జాహ్నవి నిరూపించింది.

పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాలంటే అందుకు కేరాఫ్ గా మారిపోయి, ఎందరికో నవ్వులు పంచుతోంది మహాతల్లి. చిన్న విషయాన్ని అలా అలా అల్లేసి, నవ్వులు విరబూయించే ఈమె యూట్యూబ్ ఛానల్ కి 6లక్షల 72వేలమంది సబ్ స్క్రైబర్స్ వున్నారంటే, ఆమె ఏ రేంజ్ కి చేరిందో చెప్పక్కర్లేదు. పక్కా రాయలసీమ బిడ్డ అయిన జాహ్నవిది కర్నూల్. ఆమె తండ్రి శ్రీనివాసులు లీగల్ ఎడ్వైజర్ గా కర్నూల్ లోనే పనిచేస్తున్నారు. తల్లి అనూరాధ పంజాబ్ లో కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

ఈమెకు గల ఓ సోదరుడు ఢిల్లీలో స్టడీస్ లో వున్నాడు. అందరూ తలో చోటా ఉన్నప్పటికీ ప్రతీ రెండు నెలలకొకసారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీటవుతూ ఉంటారు. చిన్నప్పుడు ఎంతో సిగ్గు తో షై ఫీలయ్యే ఈమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అందుకే 2013లో భూపాల్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ముంబయి డిజైనింగ్ హౌస్ లో నాలుగు నెలలపాటు జాబ్ చేసింది.

అయితే సినిమాల మీద గల ఆసక్తి ఆమెని హైదరాబాద్ కి రప్పించింది. అయితే టాలీవుడ్ లో ఎవరూ పరిచయం లేకపోవడంతో షార్ట్ ఫిలిం వైపు అడుగులు వేసిన జాహ్నవి ‘బ్రేక్ అప్ తర్వాత’ అనే షార్ట్ ఫిలిం లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆవిధంగా సుమారు 15షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన ఈమెకు టాలీవుడ్ లో ఛాన్స్ దక్కడంతో ‘తనూ నేను’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే సమయంలో మహాతల్లి – మహానుభావుడు’ అనే వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది.

అందులో మహాతల్లిగా నటించి, చివరకు అదే పేరుతొ ఆమె పాపులర్ అయింది. ఇక కొన్నిరోజులు మహానుభావుడు ఇంకో ఛానల్ పెట్టుకుని వెళ్లిపోవడంతో జాహ్నవి ఒంటరి అయిపోయిన నేపథ్యంలో తమిళ మీడియా సంస్థ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం, ఆమె కూడా అదే ఆలోచనతో ఉండడం, ఫలితంగా మహాతల్లి పేరిట వెబ్ సిరీస్ మొదలైంది.

ఇక ఆనాటి నుంచి ప్రతి బుధవారం ఓ షార్ట్ ఫైల్సన్ అప్ లోడ్ చేస్తున్న ఈ అమ్మడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అమ్మలు వాళ్ళ పెళ్లి గోలలు, ఆఫీసు కష్టాలు,తాగక ముందు – తాగాక, బద్ధక రత్న,పెళ్లిచూపులు,భోజన ప్రియులు ఇలా దాదాపు నాలుగు పదుల షార్ట్ ఫిలిమ్స్ ఎపిసోడ్ లు మహాతల్లి వెబ్ సైట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈమె లేటెస్ట్ గా తన స్నేహితుడు సుశాంత్ ని పెళ్లాడింది. స్క్రిప్ట్ లొకేషన్ లో ప్రిపేర్ చేయడం ఈ మహాతల్లి స్పెషాలిటీ. టీమ్ మెంబర్స్ కూడా బానే కష్టపడతారు కూడా. అందుకే ఒక్కరోజులోనే ఒక్కో ఎపిసోడ్ కంప్లిట్ చేసేస్తుంది ఈమె.