సింగర్ గీత మాధురి ఈ అలవాటు కారణంగా కోట్లు పోగొట్టుకుందా…నిజామా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న లేటెస్ట్ సింగర్స్ లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న గాయని గీతా మాధురి కి ఉన్న ఇమేజ్ నిరుపమానం.ముఖ్యంగా ఒకే ట్రెండ్ లో కాకుండా వాయిస్ మాడ్యులేషన్ మారుస్తూ, ఇటు డ్యూయెట్ ,అటు రొమాంటిక్,మరోవైపు ఫోక్,ఇలా ఏ పాటైనా సరే,అవలీలగా తన గొంతులో పలికిస్తూ,ఆకట్టుకుంటోంది. పాటను నీళ్లు నమిలినట్టుగా పడేయడం ఆమెకే చెల్లింది. అంతేకాదు ఇప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టిసున్న బిగ్ బాస్ సీజన్ టు లో కూడా ఎంట్రీ ఇచ్చి చాలా బాగా ఆడిస్తోంది. ఇక గీతా మాధురి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, యాక్టర్ నందుని ప్రేమించి పెళ్లాడింది. నిజానికి వీళ్ళద్దరో ఓ షార్ట్ ఫిలిం లో నటించిన సందర్బంగా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి, పెళ్లిపీటలు ఎక్కించింది. ఆతర్వాత ఆమె జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంది.

నందు సపోర్టింగ్ యాక్టర్ గా, సైడ్ రోల్స్ తో రాణిస్తుంటే, గీతామాధురి మాత్రం అగ్ర సింగర్ గా పాటల ప్రపంచాన్ని ఏలుతోంది. సింగర్ గా, వైఫ్ గా,మంచి ఆడపిల్లగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.అయితే ఎంత మంచి పేరున్నా సరే, ఓ ఛండాలమైన అలవాటు గీతకు ఉందట. అది కూడా ఇటీవల బయట పడిందట. పైగా ఓ ఇంటర్యూలో ఆ విషయాన్ని తానే చెప్పడం విశేషం.

కెసినో అలవాటు ఉందట కెసినో అంటే కొన్ని డబ్బులు పెట్టి ఆడే జూదం,మరి కొన్ని డబ్బులు లేకుండా ఆడే ఫన్ తో ఆడేవి ఉంటాయి. అయితే ఇటీవల ఫన్ తో ఆడేవి ఏమీ లేకపోవడంతో డబ్బులు పెట్టి ఆడే జూద క్రీడల్లో చాలా డబ్బులు పోగొట్టుకుందట. అంతేకాదు కెసినో చూడగానే మనసు ఆగక, ఉన్న పనులు కూడా పక్కన పెట్టేసి కెసినో ఆడడం కూడా ఎక్కువ జరిగిందని స్వయంగా గీతా మాధురి చెప్పుకొచ్చింది.

కెసినో లో చాలా డబ్బులు పోవడంతో ఇక దాని జోలికి వెళ్లకూడదని అనుకుందట గీతా మాధురి. ఏదైనా వ్యసనం ఉంటె ఆ మనిషిని పట్టి పీడిస్తుందని,ఇక ఓ రకంగా మంచి పని కూడా వ్యసనంగా మారిపోతుందని,అలాంటిది ఇలాంటి చెడ్డ పనులు అలవాటుగా మారితే కుటుంబం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే తాను ఇటీవల కెసినో వైపు వెళ్లలేదని, వెళ్తే అక్కడకు వెళ్లకుండా ఉండలేమని అంటోంది. ఇక యూత్ ఇప్పుడు అనేక వ్యసనాలకు బానిస అవ్వడం మంచిది కాదని కూడా సూచించింది.