చల్లని సాయంత్రం వేడివేడిగా నవరతన్ బజ్జీ

కావలసిన పదార్ధాలు :
తోటకూర,పాలకూర,చుక్కకూర,మెంతికూర,పుదీనా,బచ్చలికూర,కొత్తిమీర – అన్ని ఒక్కొక్క కట్ట,కరివేపాకు – 2 రెబ్బలు, ఉల్లికాడలు,ఉల్లిపాయలు – 2(సన్నగా తరగాలి),శనగపిండి – ఒకటిన్నర కప్పు,మొక్కజొన్నపిండి, మైదా, బియ్యంపిండి – అరకప్పు చొప్పున, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్, వాము – తగినంత,ఉప్పు,కారం – తగినంత,జీలకర్ర – 2 స్పూన్స్,వంటసోడా -చిటికెడు, నూనె – వేగించటానికి సరిపడా

తయారి విధానం
ఆకుకూరలను శుభ్రంగా కడిగి అపిచ్చి వాసన పోయే దాక వేగించాలి. దీనిలో అరకప్పు సెనగపిండి, మైదా, బియ్యంపిండి మొక్కజొన్నపిండి, అల్లంవెల్లుల్లిముద్ద, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు, కారం, చెంచా చొప్పున జీలకర్ర, వాము వేసుకుని బాగా కలపాలి. ఆకుకూరల్లో ఉన్న నీరు సరిపోతుంది. ఒకవేళ సరిపోక పొతే అప్పుడు కొంచెం నీటిని కలిపి పిండిని గట్టిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బుల్లెట్స్ మాదిరిగా చేసి పక్కన పెట్టుకోవాలి.

మరో గిన్నెలో కప్పు సెనగపిండి, మరికాస్త ఉప్పు, కొద్దిగా కారం, మిగిలిన వాము, జీలకర్ర, వంటసోడా వేసి నీటిని చేరుస్తు బజ్జీల పిండి మాదిరిగా కలుపుకొని పైన తయారుచేసుకున్న బులెట్స్ ని ముంచి నూనెలో వేగించాలి. అంతే వేడివేడిగా నవరతన్ బజ్జీ రెడీ.