మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత భర్త ఎన్నో కోట్లకు అధిపతి… ఇది నమ్మలేని నిజం

టాలీవుడ్ లో స్వయంకృషితో తిరుగులేని స్థాయికి ఎదిగిన నటుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు ఎవరైనా సరే. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా ప్రతిభతో సినీ పరిశ్రమలో అద్వితీయంగా ఎదిగి, టాలీవుడ్ ని శాసించిన చిరు రాజకీయాల్లోకి వెళ్లినా సరే, తెలుగు పరిశ్రమలో ఆయన మాట వేదవాక్కుగా చాలా మంది భావిస్తూ వస్తున్నవాళ్ళు ఉన్నారు. అలాగని అందరిపై పెత్తనం చెలాయించాలన్న ఆలోచన అసలు ఆయనకు రానే రాదు. ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే కరిగిపోతారు. కష్టాల్లో ఉన్నవాళ్లకు చిరంజీవి సాయం చేయడంతో పాటు వాళ్ళ బాగోగుల గురించి అనుక్షణం తపిస్తారు. చిరంజీవి ఒక్కరే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వాళ్ళే. ఆయన కుమార్తెలు సుస్మిత,శ్రీజ, కుమారుడు రామ్ చరణ్ తండ్రి ఆలోచనలను పుణికి పుచ్చుకున్నారని చెప్పవచ్చు.

అందుకే ఆడంబరాలకు పోకుండా సంప్రదాయ బద్దంగా వివాహాలు జరిపించి పెళ్లి విశిష్టతను ఘనంగా చాటారు. ఇందులో భాగంగా పెద్ద కూతురు సుస్మిత విషయం చెప్పాల్సి వస్తే, ఆమె వివాహం చెన్నైలో స్థిరపడిన విష్ణు ప్రసాద్ తో జరిగింది. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. ప్రసాద్ తాతయ్య L.V. రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరుమోసిన బిజినెస్ మ్యాన్. జపాన్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు.

అయన కుమారుడు ఎల్ ఆర్ ప్రసాద్, చంద్రిక దంపతుల తనయుడే విష్ణు ప్రసాద్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసిన విష్ణు ప్రసాద్, విదేశాల్లో స్టడీ పూర్తయ్యాక వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టాడు. తాతయ్య ప్రారంభించిన పామాయిల్ వ్యాపారం తండ్రి సారధ్యంలో బాగా డవలప్ అయింది. అయితే విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టాక ఆ వ్యాపారం రెండింతలు అయింది .

ప్రపంచంలోనే చాలా దేశాలకు మేలురకం పామాయిల్ ఎగుమతి చేయడం మొదలు పెట్టిన విష్ణు ప్రసాద్ వివాహం మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో జరిగింది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు. ప్రస్తుతం సుస్మిత సినీ రంగంలో అడుగుపెట్టి,చిరు, రామ్ చరణ్ మూవీలకు స్టైలిష్ గా వ్యవహరిస్తోందంటే అందుకు విష్ణు ప్రసాద్ కారణం. భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుస్మిత , చిరు 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150కి మాస్టర్ స్టైలిష్ గా వ్యవహరించింది. నిజానికి సినీ రంగం నేపధ్యం గల కుటుంబం నుంచి వచ్చిన సుస్మితకు ఆ రంగంలో అభిలాష ఉంటుందని గ్రహించి, ఆమెకు ఇష్టమైం స్టైలిష్ రంగంలో ఎంకరేజ్ చేసాడు.