విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్లు ఏ రంగంలో స్థిరపడ్డారో తెలుసా?
స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు తనయునిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. లేడీ ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా గల వెంకీ,తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు చాలా దూరంగా వుండే నటుల్లో ముందు వరస లో ఉంటాడని చెప్పవచ్చు. మంచి నడవడిక, స్నేహం వంటి వాటితో ఇండస్ట్రీలో అందరి మనస్సు దోచుకున్న వెంకటేష్ ఇప్పటివరకూ తన సినిమాలేదో తానె చేసుకుంటూ, ఏ వివాదానికి వెళ్లకుండా తన దైన స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు.ఇక వెంకటేష్ కుటుంబంలో తండ్రి రామనాయడు, అన్న సురేష్ బాబు గురించి అందరికీ తెలిసినప్పటికీ వెంకటేష్ తన ఫ్యామిలీ విషయాలను మాత్రం ఎక్కడా షేర్ చేసుకోడు.
అసలు వెంకీ భార్య,పిల్లలు ఎలా వుంటారు, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వంటి విషయాలు ఎప్పుడూ చెప్పడు. అందుకే అతని ఫామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. వెంకీ భార్య పేరు నీరజ. వారి పెళ్లి 1985లో జరిగింది.వారికి ఆశ్రీత, హయవాహిని, భావన అనే ముగ్గురు కూతుళ్లు, అర్జున్ రామనాధ్ అనే ఓ కుమారుడు మొత్తం నలుగురు సంతానం వున్నారు.
వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత బిజినెస్ రంగంలో మక్కువ చూపిస్తోంది. వ్యాపార రంగంలో అద్భుతాలు చేయాలని ఉందని ఆమె ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పింది కూడా. రెండో కూతురు హయవాహిని ఫ్యాషన్ దైజైనర్ కావాలని కోరుకుని ఆ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆమె చేసిన డిజైన్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తున్నాయట.
ఇక మూడో కూతరు భావన ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. మంచి కథ దొరికితే సినీ రంగ ప్రవేశం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక కొడుకు అర్జున్ రామనాధ్ మాత్రం సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఈ వార్తలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎప్పుడూ తన భార్య పిల్లలను బయటకు తీసుకురాని వెంకటేష్,ఇటీవల జివికె మనవరాలి పెళ్ళిలో భార్య నీరజతో కల్సి దర్శనం ఇచ్చాడు.
ఇక ఆ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో ఫంక్షన్ లో కొడుకు అర్జున్ ని కూడా మీడియాకు పరిచయం చేసాడు. అయితే వెంకీ కూతుళ్లు మాత్రం ఇప్పటికీ మీడియాకు దూరంగానే వుంటున్నారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీలో జరిగిన ఓ ఫంక్షన్ లో హాజరవ్వడం తో వెంకీ ఫామిలీ ఎలా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అకక్కడి ఫోటోలు వెంకటేష్ అభిమానులకు ఆనందం పంచిదనడంతో అతిశయోక్తి లేదు.