Politics

అమల తీసుకున్న సంచలన నిర్ణయం ….షాక్ లో నాగార్జున,అఖిల్

సాధారణ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎవరెవరు ఏ పార్టీకి వస్తారో ఎవరు జంప్ చేస్తారో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కొంతమంది నాన్ పొలిటికల్ ప్రముఖులను పార్టీల్లోకి తెచ్చే ప్రక్రియను కూడా కొన్ని పార్టీలు మొదలెట్టాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే, టీడీపీ, వైస్సార్ కాంగ్రెస్ ల మధ్య వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. చావో రేవో అన్నట్లు ఈ రెండు పార్టీలు సర్వ శక్తులు ఒడ్డడానికి ఇరు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తామే క్రియాశీలకం అవుతామని, సీఎం తానేనని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇంకా జనసేన అన్ని జిల్లాల్లో పటిష్టం కాలేదు. పవన్ తప్ప మరో కీలక మైన నేతలు ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించే అభ్యర్థులు గానీ కనిపించడంలేదని వినిపిస్తోంది.

ఈ పరిణామమే పార్టీకి ,పవన్ కి తీవ్ర నష్టాన్ని తీసుకు వచ్చే ప్రమాదం ఉందని అంటున్న తరుణంలో చిరంజీవి అభిమాన సంఘాలు జనసేనలో చేరడం పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తోంది. అంతేకాదు,చిరంజీవి, నాగబాబు మొత్తం మెగా ఫ్యామిలీ పవన్ కి తోడుగా నిలవబోతున్నాయి. ఇక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే గెలుస్తారా అంటే, ఖచ్చితంగా గెలుపునకు సహకరిస్తుందే తప్ప,గెలవడం మాత్రం కష్టమే. తమవలన గెలుపు రాదనే విషయం మెగా ఫ్యామిలీకి కూడా తెలుసు.

అభ్యర్థుల ఎంపికే ఎన్నికల్లో కీలకం అవుతుందని భావించి అందుకోసం పవన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. ప్రజల దృష్టిలో మంచిగా ఉన్నవాళ్లను నిలబెడితే గెలుపు సాధ్యమని భావించిన పవన్, స్వచ్ఛంద సంస్థల అధిపతులపై దృష్టి సారించినట్లు బోగట్టా. ఇప్పటికే ఆదిశగా కొంతమందిని ఎంపిక చేసారని తెలుస్తోంది. ఇందులోభాగంగా సినీ ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులపై కూడా కన్నేశారట.

అందులో మరీ ముఖ్యంగా స్వచ్ఛంద సేవ సంస్థల పేరిట ప్రజల్లో గుర్తింపు పొందిన వ్యక్తులపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఇక ఇదే సందర్భంలో చిరంజీవి నాగబాబుల ను పవన్ సంప్రదించగా, అక్కినేని నాగార్జున భార్య అమల పేరుని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఓ నటిగా మాత్రమే కాకుండా,స్వచ్ఛంద సంస్థను పెట్టి,మూగజీవాల సంరక్షణ మరియు స్త్రీల సమస్యలపై,అలాగే సామాజిక కోణంలో పలు అంశాలపై ఆమె ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే వున్నారు.

ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తన కార్యక్రమాలను చేస్తున్న అమలను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి మంచి ప్రయోజనం ఉంటుందని చిరంజీవి ప్రతిపాదన చేసినట్లు బోగట్టా. అయితే ఇదే విషయమై నాగార్జునను కూడా సంప్రదించారట. ఇక మరోవైపు వైస్సార్ సిపి అధినేత జగన్ కి నాగార్జున మంచి స్నేహితుడు, పలు వ్యాపార విషయాల్లో కూడా వున్నారు. అందుచేత పవన్ కోరికను సున్నితంగా తిరస్కరించినా, చిరుతో నాగ్ కి గల మైత్రి కారణంగా తుది నిర్ణయం అమల కే వదిలేసినట్లు తెలుస్తోంది.

ఇక అమల ఏపీలో ఎంపీ గా గానీ, ఎమ్మెల్యే గా గానీ ఎక్కడ నుంచి పోటీచేయాలని అనుకున్నా గానీ, లేదా తమ స్వంత జిల్లా కృష్ణా జిల్లా నుంచి పోటీచేయాలనుకున్నా, టికెట్ ఇస్తామని కూడా పవన్ హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈవిషయంలో అమల ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అయితే స్వచ్ఛంద సేవలు అందిస్తున్న అమలు జనసేనలో చేరితే ఆపార్టీకి మరింత బలం చేకూరడం మాత్రం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.