విలన్ వినోద్ కి సూపర్ స్టార్ కృష్ణకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

ఓ పక్క టాలీవుడ్ ని, మరోపక్క బుల్లితెర ప్రేక్షకులను శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వీళ్ళిపోయారు నటుడు వినోద్. హీరోగా సినీ పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టి, విలన్ గా, క్యారక్టర్ యాక్టర్ గా రాణించిన వినోద్,సినీ పరిశ్రమలోనే కాకుండా , బుల్లితెర రంగంలోనూ తనదైన ముద్రవేశారు. 1970దశకంలో మద్రాసు చేరిన ఈయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకునే స్థాయికి ఎదిగారు. ఈయన అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని నందివెలుగు గ్రామం ఈయన స్వస్థలం. వీళ్లది వ్యవసాయ కుటుంబం అయినా, తండ్రి పౌరాణిక నాటకాల్లో భీముడు, దుర్యోధనుడు క్యారెక్టర్ల తో రాణించాడట.తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వినోద్ కాలేజీ డేస్ లో నాటకాల్లో వేసేవారు.

ఇక పక్క ఊళ్ళో జరిగే దుర్గామాత ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని,నాటకాలు వేసేవారు. సినిమాల్లో ట్రై చేయవచ్చు కదా అని అందరూ ఇచ్చిన సలహా తీసుకుని చెన్నపట్నం చేరుకున్న వినోద్ మద్రాసులో ఓ రూమ్ లో ఉంటూ వేషాల కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన అమ్మన్ క్రియేషన్స్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెల్సి వెళ్లిన 200మందిలో వినోద్ ఒక్కరే సెలక్ట్ అయ్యారట. ఆవిధంగా 1981లో అర్ధం గల్ ఆయిరం అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.

16 ఏళ్ళ వయస్సు వంటి సూపర్ హిట్ మూవీ తీసిన బ్యానర్ లోనే వినోద్ తన నట ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ విధంగా వినోద్ కి కల్సి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 40తమిళ చిత్రాల్లో ఆయన నటించారు. అందులో 10,12చిత్రాల్లో హీరోగా వేసారు. తెలుగులో కీర్తి కాంత కనకం మూవీతో తెలుగులో పరిచయం అయిన వినోద్,ఆతర్వాత నల్లత్రాచు,టార్జాన్ సుందరి,వీరవిహారం వంటి చిత్రాల్లో హీరోగా వేశారు.

అయితే,హీరో కన్నా విలన్ ఆఫర్లు ఎక్కువ రావడంతో ఆదిశగా అడుగులు వేశారు. అప్పట్లో సూపర్ స్టార్ నటించిన ప్రతిచిత్రంలోనూ వినోద్ ఉండేవాడు. దీనికి కారణం కూడా వుంది. కృష్ణ సొంతూరు బుర్రిపాలెం పక్కనే వినోద్ ఊరు కూడా. అందుకే వినోద్ అంటే కృష్ణ ఎంతో అభిమానించేవాడు.

వినోద్ ని సొంతమనిషిగా కృష్ణ భావించేవారు. ఇక తొలిరోజుల్లో షెడ్యూల్ కి 5వేలవరకూ రెమ్యునరేషన్ తీసుకునే వినోద్ అప్పట్లోనే ఫియట్ కారులో తిరిగేవారు. ఇక రెమ్యునరేషన్ లక్షలకు చేరింది. ఇక ఆయనకు మంచి మిత్రులు నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు, బెనర్జీ లే. ఇక హీరోల్లో ఆయనతో ఎక్కువగా క్లోజ్ గా మూవీ అయ్యింది బాలకృష్ణ . ఇక మెగాస్టార్ అయితే ఏరా వినోద్ అంటూ భుజంపై చేయివేసి, పిలిచేవారు.

అంతేకాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా వినోద్ ని సొంత తమ్ముడు కంటే ఎక్కువగా భావించేవారట. ఇంతమంది తనను మెచ్చుకుంటున్నా, వినోద్ మాత్రం మోహన్ బాబునే ఇష్టపడేవారు. ఆయన చాలా మమకారం గల వ్యక్తని ఓ ఇంటర్యూలో వినోద్ చెప్పారు కూడా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వినోద్ అంటే అందరికీ ఇష్టమే.

ఇక వినోద్ సంతానం విషయానికి వస్తే, పెద్ద కూతరు, అల్లుడు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కుమారుడు తన భార్యతో కల్సి విజయవాడలో సెటిల్ అవ్వగా, చిన్న కుమార్తె భర్తతో కల్సి నెల్లూరులో ఉంటోంది. కృష్ణపట్నం పోర్టులో ఉన్నతాధికారిగా చిన్నల్లుడు పనిచేస్తున్నాడు. వినోద్ అన్నయ్య రాజకీయాల్లో,తమ్ముడు బిజినెస్ రంగంలోనూ స్థిరపడ్డారు. కానీ వినోద్ కంటే ముందే సోదరులిద్దరూ కన్నుమూయడం వారి కుటుంబంలో విషాదం. ఇప్పుడు వినోద్ కూడా పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.