S.P. బాల సుబ్రమణ్యం ‘అన్న’ ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

సినీ రంగంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. హీరో హీరోయిన్స్ కావచ్చు, గాయకులూ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళ మధ్య బంధం వున్నా ఎందుకనో వాళ్ళు బయటకు చెప్పుకోరు కొందరు. అలా చెప్పడం ఎందుకనో ఏమో గానీ అసలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. కారణం ఏదైనా ఇలాంటి బాపతు వాళ్లలో ఎవరున్నారా అని చూస్తే ఆశ్చర్య కరమైన విషయం వెలుగు చూసింది. ఇందులో ఒకరు దాదాపు 50 ఏళ్ళు తన గాత్రంతో సినీ రంగాన్ని శాసించారు. పాటంటే ఆయనే. ఆయన లేకుంటే సినీ ఇండస్ట్రీయే లేదు. ఆయన గాత్రంతో ఎందరో హీరోల స్టార్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఆయనే మన గాన గంధర్వులు పద్మశ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.

దాదాపు 16భాషల్లో తన గాత్రంతో 50వేలకు పైగా పాటలు పాడిన ఏకైక తెలుగు గాయకుడు ఎస్పీ బాలు. గాయకునిగా ఎంతోఎత్తుకి ఎదిగిన మహానుభావుడు ఆయన. ఇలా ఈయన సినీ ఇండస్ట్రీని ఏలేస్తే, ఇక ఈయన అన్న కూడా హీరోగా సినీ రంగాన్ని దున్నేశారు. ఏ హీరోయిన్ అయినా ఈయన పక్కన నటిస్తే,చాలు స్టార్ హీరోయిన్ అయిపోతారనే సెంటిమెంట్ కూడా వుంది.

అలా ఎందరో హీరోయిన్లు ఈయన పక్కన నటించాకే స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. హీరోయిన్స్ కి లక్కీ హీరోగా ఓ వెలుగు వెలిగిపోయాడు. అందరినీ కడుపుబ్బా నటిస్తూ,హీరోయిన్స్ కలల రాకుమారుడుగా ఓ వెలుగు వెలిగిన ఆయనే మనందరినీ నవ్వించిన హీరో చంద్రమోహన్. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.

1943 మే 23న కృష్ణా జిల్లా పామిడి ముక్కల అనే ఊళ్ళో స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఎన్నో నాటకాల్లో వేసిన చంద్రమోహన్ కి నటన అంటే చాలా ఇష్టం. చంద్రమోహన్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో రంగుల రాట్నం సినిమాకోసం బిఎన్ రెడ్డి ఆడిషన్స్ పెట్టారు. ఆ రోజుల్లో ఆడిషన్స్ అంటే ఫోటో పంపడమే.

అలా చేరిన చంద్రమోహన్ ఫోటో చూసి, స్క్రీన్ టెస్ట్ చేయించి, రంగుల రాట్నంలో ఛాన్స్ ఇచ్చారు. అలా తెలుగు పరిశ్రమలో ఆరంగేట్రం చేసిన చంద్రమోహన్ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఈ మూవీ హిట్ కొట్టడమే కాదు నేషనల్ అవార్డు కూడా ఈ మూవీ గెలుచుకుంది. చంద్రమోహన్ అవార్డు కూడా అందుకున్నారు.

ఇక ఈ సినిమాతోనే అగ్రనటి వాణిశ్రీ,నటి విజయ నిర్మల ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రేఖ కూడా ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో వాణిశ్రీ, విజయ నిర్మల స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిపోయారు. బహుశా అందుకేనేమో హీరోయిన్స్ మొదట చంద్రమోహన్ పక్కన యాక్ట్ చేయడానికి అంతగా ఆరాట పడేవారు. చూడ్డానికి హ్యాండ్సమ్ గా, రింగు రింగుల జుట్టుతో చలాకీగా ఉండే చంద్రమోహన్ కి సినీ అవకాశాలు వరుసపెట్టి వచ్చాయి.

1966నుంచి 2018వరకూ దాదాపు 52ఏళ్ళ సినీ కెరీర్ లో 22ఏళ్ళు స్టార్ హీరోగా సినీ రంగాన్ని దున్నేసాడు. కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీ మోహన్ ఇలా అందరితో మల్టీ స్టారర్ మూవీస్ లో కూడా నటించాడు. ఈయనతో ఏ హీరోయిన్ అయినా ఒక్కసినిమాలో నటిస్తే చాలు వాళ్ళ దశ తిరిగినట్టే. శ్రీదేవి,జయప్రద, జయసుధ, రాధిక,విజయశాంతి, మాధవి,ఇలా ఎందరో స్టార్ హీరోయిన్స్ ఈయనతో నటించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అందుకే ఈయన పక్కన నటించడానికి హీరోయిన్స్ పోటీ పడేవారట.

అయితే రానురాను వయస్సుకు తగ్గ క్యారక్టర్ యాక్టర్ గా ఒదిగిపోయాడు. తండ్రి పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ వేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన చంద్రమోహన్ ఇంతకీ ఎవరంటే, ఎస్పీ బాలు కి అన్నయ్య . అవును వరుసకు ఇద్దరూ అన్నదమ్ములు అవుతారు. ఎవరి రంగంలో వాళ్ళు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వీళ్ళు ఏనాడూ తమ రిలేషన్స్ బయట పెట్టుకోలేదు.

ఇక శోభన్ బాబు ఇచ్చిన సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి, సంపాదించే సమయంలోనే జాగ్రత్త పడ్డారు. అందుకే ఈయన ఆస్తుల విలువ 300 కోట్లు. వచ్చిన డబ్బుని సద్వినియోగ పరచుకోకుండా రోడ్డున పెద్దవాళ్ళని ఎందరినో చూసాం. అయితే చంద్రమోహన్ లాంటి కొద్దిమంది మాత్రమే ముందు జాగ్రత్తతో భూములను నమ్ముకుని నిలబడ్డారు.