మిర్చిలో కుర్ర కారుని ఊపేసిన హంసానందిని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
మిర్చిలో కుర్ర కారుని ఊపేసిన నార్త్ ఇండియా భామ హంసానందిని టాలీవుడ్ లో స్థిరపడింది. టాలీవుడ్ లో ఐటెం సాంగ్ అంటే ఈమె గుర్తొచ్చేలా పాపులర్ అయిన ఈ భామ సిక్స్ ఫీట్ హైట్ తో హీరోలకు ధీటుగా ఉంటుంది. చూడ్డానికి హీరోయిన్ ఫీచర్స్ ఉన్నప్పటికీ కేరక్టర్ రోల్స్,వైసీ సాంగ్స్ తోనే సరిపుచ్చుకుంటోంది. అసలు ఈమె ఉంటె చాలు సినిమా మొత్తానికే లక్కు అనే సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. మిర్చి లాంటి కుర్రాడే పాట తో మిర్చి మూవీ ఏ రేంజ్ లో వెళ్లిందో ఇక చెప్పక్కర్లేదు. ఈగ, అత్తారింటికి దారేది చిత్రాల్లో ఆమె ఎప్పీయరెన్స్ ఆడియన్స్ ని మెప్పించింది ఈ పూణే భామ. అగ్ర హీరోలంతా కనీసం హంసా ఒక్క పాటైనా చేయాలని భావిస్తున్నారంటే,సెంటిమెంట్ బానే వర్కవుట్ అవుతోంది. అందుకే నిర్మాతలు కూడా ఈమెపై మొగ్గు చూపుతున్నారు.
ఇండస్ట్రీకి వచ్చి 14ఏళ్ళు పూర్తిచేసుకున్న ఈమె అసలు పేరు పూనమ్ భరత్కే 1984 డిసెంబర్ 8న జన్మించిన ఈమెకు తల్లి చిన్ననాటే చనిపోయింది. అయితే తండ్రి ఎంతో గారంభంగా పెంచాడు. కాలేజీ చదువయ్యాక 2002లో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కొద్దికాలానికి స్టార్ మోడల్ గా ఎదిగింది. మోడల్ గా ఆమెను చూసిన టాలీవుడ్ జనాలు ఆమెలో హీరోయిన్ లక్షణాలున్నాయని గుర్తించడంతో 2004 లో ఒక్కటవుదాం మూవీతో తెలుగులోకి ఒరిజనల్ పేరుతొ హీరోయిన్ గా అడుగుపెట్టింది.
తొలి చిత్రం హీరో ఎవరంటే బిగ్ బాస్ షోలో అలరిస్తున్న కౌశల్ .ఆ మూవీ బానే ఉందనే టాక్ రావడంతో 786 ప్రేమ కథా చిత్రంలో నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పేరు హంసానందిని గా మారడం వెనుక వంశీ తీసిన అనుమానాస్పదం మూవీ. ఆ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా సూచించిన కర్ణాటక సంగీతంలోని రాగాల్లో ఒకటైన హంసానందిని ఆమె పేరుగా మారింది.
ఆ తర్వాత జగపతిబాబులో అధినేత, ప్రవరాఖ్యుడు చిత్రాల్లో చేసింది. భాయ్, రామయ్య వస్తావయ్యా,అత్తారింటికి దారేది,లెజెండ్ మూవీస్ తో పాటు రుద్రమదేవి లో వేసిన మదనిక పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా వచ్చిన పంతం మూవీలో కూడా నటించింది. ఇక గత కొంతకాలంగా ఓ నార్త్ ఇండియా యువకునితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు స్వయంగా ఈమె వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ టూర్ లో పరిచయమైన అతని పేరులోని తొలి అక్షరాన్ని టాటూగా వేయించుకుంది. ఇటీవలే బాయ్ ఫ్రెండ్ తో కల్సి యుఎస్ టూర్ కూడా చేసి వచ్చింది ఈ అందాల భామ.