Movies

హీరో సిద్ధార్ధ్ భార్య ఎందుకు విడాకులు ఇచ్చిందో తెలుసా… నమ్మలేని నిజం ఏమిటో తెలుసా

హీరో సిద్ధార్ధ్ అనగానే నూనూగు మీసాల కాలేజీ కుర్రాడుగా నటించిన బాయ్స్ సినిమా ఠక్కున గుర్తొసుంది . ఎందుకంటే ఆ మూవీతో యూత్ ఐకాన్ గా పేరుతెచ్చు కున్నాడు సిద్ధార్ధ్. అంతే కాదు ఆ సినిమాలో నటనకు ప్రతిష్ఠాత్మక ఐటిఎఫ్ ఏ అవార్డు గెలుచుకున్న ఇతనికి వరుస హీరో ఛాన్సులు వచ్చిపడ్డాయి. ఇక ప్రభుదేవా డైరెక్షన్ లో తెలుగులో నేరుగా వచ్చిన ‘నువ్వవొస్తానంటే నేనొద్దంటానా’మూవీ తో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక బొమ్మరిల్లు మూవీతో సెలబ్రిటీ గా రూపాంతరం చెంది,ఫిలిం మేకర్స్ పాలిట కల్పతరువయ్యాడు. అంతేకాదు తక్కువ బడ్జెట్ లో తీసినా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టవచ్చని ఆట మూవీ ద్వారా సిద్ధార్ధ్ నిరూపించాడు. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ మూవీ తర్వాత ఎందుకనో సక్సెస్ లు తగ్గిపోయాయి.

ఓయ్,బావ, ఓ మై ఫ్రెండ్ సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. లవ్ ఫెయిల్యూర్,జబర్ దస్త్, సం థింగ్ సం థింగ్ చిత్రాలు కూడా డిజాస్టర్ కావడంతో నిరాశ, అసహనం ఆవరించి,నిర్మాతలని, ఆడియన్స్ ని ఆడిపోసుకోవడంతో అతన్ని బ్యాన్ చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. దాంతో టాలీవుడ్ ని వదిలేసి తమిళ చిత్రాలకే సిద్ధార్ధ్ పరిమితం అయ్యాడు. అయితే సిద్ధూ చిరాకు వెనుక ఓ బలమైన వేరే కారణం ఉందట.

అదేంటంటే, సిద్ధూ మొదటి వైఫ్ ఇచ్చిన షాక్ తో మతిపోయి,సినిమాలపై ఇంట్రెస్ లేకపోవడం వలన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపించిందని విమర్శకులు అంటుంటారు. నిజానికి సిద్ధుకి 2003లోనే పెళ్లయింది. అయితే నాలుగేళ్లకే ఇద్దరూ డైవర్స్ బాట పట్టాల్సి వచ్చింది.
ఇంతకీ సిద్ధార్ధ్ పర్సనల్ విషయాల్లోకి వెళ్తే, అతని తండ్రి సూర్యనారాయణ ఓ సంస్థలో ఉన్నతాధికారిగా ఉంటున్నాడు. తల్లి గృహిణి. సిద్దూకి జయేంద్ర అనే సోదరుడు, సంధ్య అనే సోదరి ఉన్నారు.

అతని టీనేజ్ అంతా ఢిల్లీలో గడిచింది. అక్కడ సర్ దాస్ పటేల్ విద్యాలయ లో చదివేటప్పుడు క్లాస్ మేట్ మేఘనతో లవ్ లో పడ్డాడు. ఇద్దరూ పక్కపక్క ఇళ్ళు కావడంతో బంధం బలపడడంతో 2003లో పెద్దలను ఎదిరించి పెళ్ళిచేసుకుని చెన్నైలో కాపురం పెట్టేసాడు. ఇతరులకు అసూయ పుట్టించేలా ఎంతో ఆనందంగా వీరి కాపురం సాగిపోయింది.

కానీ రంగ్ బసంది మూవీకోసం ముంబయిలో మకాం పెట్టిన సిద్ధార్ధ్ కి హీరోయిన్ సుహాన్ లికాతో సాన్నిహిత్యం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీయడం,ఇక ఎన్నో విధాలుగా చెప్పినా భర్త లో మార్పు లేకపోవడం నేపథ్యంలో విడాకులకు పట్టుబట్టింది. ఆమె నుంచి వచ్చిన ఈ హాఠాత్ పరిణామానికి షాక్ తిన్న సిద్ధూ ఆతర్వాత కాళ్ళా వెళ్ళా పడినా ఆమె మెత్తబడలేదని తెలుస్తోంది. ఆఖరికి 2007లో ఇద్దరూ అధికారికంగా విడిపోయారు.

ఇక వీళ్లకు ఇద్దరు పిల్లలున్నట్లు ప్రచారం ఉన్నా, తనకు సంతానం ఉన్నట్లు సిద్దూ ఏనాడూ బయటకు వెల్లడించలేదు. ఇక మేఘనతో ఎప్పుడూ రాజీ ప్రయత్నాలు చేయకపోగా, విడాకుల తర్వాత మరింత రెచ్చిపోయాడు. ఓ దశలో శృతి హాసన్ తో కల్సి ముంబయిలో కాపురం పెట్టినట్లు కధనాలు వచ్చాయి. కమల్ హాసన్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తుంటాయి.