జులాయి సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురుగా నటించిన ఈ అమ్మాయి .బాలీవుడ్ లో టాప్ హీరోయిన్

కొందరు నటిగా ఎదగాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మూవీ తోనే అది సాధ్యం చేసుకోవచ్చు. సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫెర్ అవార్డుతో నామినేట్ అవ్వడమే కాకుండా,షార్ట్ ఫిలిమ్స్ లోనూ, అటు తమిళ,ఇటు తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తోంది కల్పిక గణేష్. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే కల్పిత పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రోజుల్లో , ప్రయాణం అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కల్పికకు వచ్చిన ఛాన్స్ నిజంగా లక్కీయేనని చెప్పవచ్చు. చిన్ననాటి నుంచి చదువులో దూసుకెళ్లే ఈమె, డాన్స్ షోల్లో కూడా బాగా రాణించేది. ఆ ఇంట్రెస్ట్ తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేలా చేసిందని చెప్పవచ్చు.

ఒకప్పుడు సోనీ టివిలో బూగీ ఊగి అనే టాప్ మోస్ట్ డాన్స్ షోలో ఆడిషన్స్ కి వచ్చిన కల్పితను చూసి, తాము తీయబోయే మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయడంతో ప్రయాణం మూవీలో హీరోయిన్ కి ఫ్రెండ్ కేరక్టర్ గా నటించి మెప్పించింది. అలా తెలుగు సినిమా రంగప్రవేశం జరిగింది.ఇక మొదటి సినిమాతోనే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కల్పిక ఫిల్మ్ ఫెర్ అవార్డు కి నామినేట్ అయింది. సినీ ప్రయాణంలో ఆమె ఎందరో స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సపోర్టింగ్ యాక్ట్రెస్ గానూ వేసింది.

నిజానికి జులాయి మూవీలో నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురిగా నటించి అందరి దృష్టిని ఆకర్శించిన కల్పిక ఆతర్వాత ఆరెంజ్ మూవీలో హీరోయిన్ జెనీలియాకు ఫ్రెండ్ గా, నిప్పు మూవీలో రవితేజాకు మరదలిగా నటించింది. ఇక దిల్ రాజు నిర్మాతగా ప్రతిష్ఠాత్మకంగా వెంకేటేష్, మహేష్ బాబు లతో నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో హీరోయిన్ సమంతకు అక్కగా నటించింది.

ఆ సినిమాతో కల్పికకు బ్రేక్ రావడంతో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించే చాన్సు లొచ్చాయి. ఇక సినిమాల్లోనే కాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నవరత్న ఆయిల్,సూపర్ స్టార్ మహేష్ బాబుతో గోల్డ్ రిచ్ సన్ ఫ్లవర్ ఆయిల్ యాడ్స్ లో నటించింది.

సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కాకుండా సీత ఆన్ థి రోడ్,దెబ్బకు ఠా దొంగల ముఠా,చూడామణి వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించిన ఈమెకు కమర్షియల్ గా హిట్ కాకున్నా, హీరోయిన్ గా మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు లేవని శ్రీరెడ్డి లాంటివాళ్లు గొడవ చేస్తున్న ఈరోజుల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ హీరోయిన్ గా రాణిస్తున్న కల్పిక లాంటివాళ్లు ఎందరికో స్ఫూర్తి.