Politics

ముఖేష్ అంబానీ గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

టెలికాం రంగంలో విప్లవాత్మకంగా జియో ప్రవేశపెట్టిన ముఖేష్ అంబానీ, అత్యంత చౌకగా డేటా అందించవచ్చని రిలయన్స్ ద్వారా నిరూపించారు. ఉచితంగా ఎంతైనా మాట్లాడుకునే వెసులు బాటు ఉందని వినియోగదారులకు తొలిసారి తెలియజెప్పింది ఈయనే కదా. ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఎదిగిన ముఖేష్ వ్యక్తిగత జీవితం ఎంతో ఆసక్తికరం. 1957 ఏప్రియల్ 19న అరబ్ దేశం యెమెన్ లోని ఈడెన్ నగరంలో జన్మించాడు. ఆ సమయంలో అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ గల్ఫ్ దేశాల్లో చమురు వ్యాపారం చేస్తున్నాడు. ధీరూభాయ్ కి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిగారు. అయితే నిత్యం సంక్షోభాలతో అట్టుడిగే యెమెన్ లో ఉండలేక కుటంబంతో సహా భారత్ వచ్చేసాడు.

మొదట్లో ముంబై లోని ఓ చిన్న ఇంట్లో అంబానీ నివసించారు. హిల్ గ్రెన్స్ హైస్కూల్ లో ముఖేష్ విద్యాభ్యాసం చేసేటప్పుడు ఆది రోహిత్ గోద్రెజ్ ,ఆనంద్ మహేంద్ర లు క్లాస్ మేట్స్ .వీళ్లంతా మంచి ఫ్రెండ్స్ గా వుండేవాళ్ళు. గోద్రెజ్,మహేంద్ర – మహేంద్ర సంస్థలు ఇప్పుడు ఎంతటి ఉన్నతి స్థితిలో ఉన్నాయో తెలుసు కదా. చిన్నప్పుడు చదువులో పోటీ పడిన ముఖేష్ పెద్దయ్యాక కూడా వ్యాపారంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు.

తన స్నేహితులైన సరే ఇతర కంపెనీల కన్నా తన సంస్థ నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లాలని కలలు కన్నాడు. ఇందుకోసం ఎన్నో కష్ట నష్టాలూ అనుభవించి, నేడు ప్రపంచ స్థాయి వ్యాపార వేత్తలు సైతం అసూయ పేదెలా ఎదిగాడు.మాంసాహారానికి పూర్తి దూరంగా వుండే ముఖేష్ పక్కా విజిటేరియన్. అంతేకాదు లైఫ్ లో ఇంతవరకూ ఒక్కసారి కూడా మద్యం జోలికి వెళ్లలేదట.

నిజానికి బిజినెస్ వరల్డ్ అంటే పార్టీలు,ఫంక్షన్లు వంటి వాటితో ఎంతో లావిష్ లైఫ్ స్టైల్ ఉండడం సహజం. కానీ ఎక్కడా ఓ చుక్క హల్క్ హాల్ కూడా ముట్టిన పాపాన పోలేదట. అయితే లగ్జరీ అంటే ఎంతోఇషపడే ముఖేష్ ముంబయిలోని అంటిల్లా పేరుతొ అత్యంత విలాసవంతమైన రాజసౌధం లాంటి నివాస భవంతి కట్టుకున్నాడు. దానివిలువ వేలకోట్లుంటుంది.

ఇక ప్రపంచంలోని బ్రాండ్ కార్లన్నీ అంబానీ దగ్గర, ఇంకా చెప్పాలంటే ఇండియాలో ఎవరి దగ్గారా లేని కార్లు ఈయన వద్ద ఉన్నాయి. వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 168 టాప్ మోస్ట్ కార్లున్నాయట. ఇక ప్రధాన మంత్రి ఉపయోగించే బులెట్ ప్రూఫ్ తరహా వాహనాన్ని ముఖేష్ ఎప్పటినుంచో వాడుతున్నారంటే,ఈయన లైఫ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.