మన హీరోల బలహీనతలు చూస్తే షాక్ అవ్వటం ఖాయం

తెలుగు హీరోలు,హీరోయిన్స్ అంటే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. తమ అద్భుతమైన నటనతో అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసి అభిమానుల ఆరాధ్య దైవాలుగా మారిపోయారు. సినిమాల్లో సూపర్ హీరోలుగా ఉండే హీరోలు అందరూ తెర వెనక సాధారణ మనుషులే. వారికి కొన్ని ఇబ్బందులు,బలహీనతలు ఉండటం సహజమే. కొందరు హీరోల బలహీనత కారణంగా ఒక్కోసారి పబ్లిక్ లో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలా ఇబ్బంది పడిన వారి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగానికి వచ్చిన నందమూరి బాలకృష్ణకు ముక్కు మీద కోపం ఎక్కువ. అంతేకాక జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు.

సినిమా షూటింగ్ అయిన, ఇంటిలో చిన్న వేడుక అయినా జాతకం చూడందే మొదలు పెట్టడట. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ బాబుకి ఒకప్పుడు సిగరెట్ త్రాగే అలవాటు ఎక్కువగా ఉండేదట. ఆ అలవాటు నుండి బయట పడటానికి మహేష్ కి చాలా సమయమే పట్టింది. ఇదే కాకుండా మహేష్ కి మరో బలహీనత కూడా ఉంది.

షూటింగ్ జరిగే సమయంలో షూటింగ్ కి సంబందించిన వారు కాకూండా ఎవరైనా ఉంటే లేచి వెళ్ళిపోతాడట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి నిర్మాణం మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే అన్ని విషయాల్లోనూ అయన పర్యవేక్షణ ఉంటుంది. పవన్ కథ విషయంలో జోక్యం చేసుకోవటం వలన సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయని కొంత మంది దర్శకులు అంటూ ఉంటారు.

ఎన్టీఆర్ అయితే షూటింగ్ చేసే సమయంలో కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే తెగ సిగ్గు పడిపోతాడట. అలాగే మొహమాటం కూడా ఎక్కువేనట. ఎన్టీఆర్ షూటింగ్ లో ఉంటె అందరిని ఆట పట్టిస్తాడట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ.

పెద్ద పెద్ద సీన్స్ చేసేటప్పుడు ఎవరిని సెట్ లో ఉండనివ్వడట. ఆ సీన్స్ బాగా రావాలంటే తక్కువ మంది ఉండాలని అంటాడట ప్రభాస్. అలాగే బద్ధకం కూడా ఎక్కువేనట. ఇవండీ మన హీరోల బలహీనతలు.