సీతాకోకచిలుక సినిమాలో నటించిన అరుణ గుర్తు ఉందా? ఆమె సినిమాలకు దూరం కావటానికి కారణం ఏమిటో తెలుసా?

ముచ్చర్ల అరుణ ‘జేగంటలు’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ‘సీతాకోకచిలుక’సినిమాతో స్టార్‌డమ్‌ను అందుకొని, తన పది సంవత్సరాల కెరీర్ లో దాదాపుగా 70 సినిమాల్లో నటించారు. ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఆమె ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో ఆమె జీవితంలో జరిగిన అనేక సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించిన ముచ్చర్ల అరుణ చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది. ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక లేదు. ఆమె చుదువుకొనే రోజుల్లో మ్యూజిక్,డాన్స్ నేర్చుకునేది. అక్కడ ఆమెను భారతీరాజా, నివాస్‌గారు చూసి ఫాలో అవుతూ అరుణ ఇంటికి వచ్చారట.

మీరు మా సినిమాలో నటించాలని అడిగారట. నాకు నటన గురించి ఏమి తెలియదని చెప్పితే ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక ఆ విషయాన్నీ నేను మర్చిపోయాను. మరల కొంత కాలానికి భారతీరాజా, నివాస్‌గార్లు మా ఇంటికొచ్చారు. ‘గోల్డెన్‌ ఛాన్స్‌ ఇది. వదులుకోకు’ అని మా కజిన్‌ బ్రదర్‌ చెప్పారు.

ఆమె ఈ సందర్భంగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావటానికి కారణం కూడా చెప్పారు. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం మీద చాలా చర్చ జరిగింది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని చెప్పారు. అది నీకు ఇష్టమేనా అని అడిగారు.

నేను కాస్త సమయం కావాలని అడిగాను. నేను ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదు. మా చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం చెబుతుండేది.

‘ఆడపిల్ల అయినా, కాకపోయినా ప్రతి మనిషికి ఒక తోడూ-నీడా ఉండాలి’ అని. అది గుర్తుకు వచ్చి, నిర్ణయం తీసుకున్నా. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ వెనకడుగు వేయను’’ అని తెలిపారు.