Movies

శరవణ స్టోర్స్ యాడ్ లో తమన్నా, హన్సికలతో చేసిన వ్యక్తి అసలు కథ తెలిస్తే షాక్ తింటారు.

శరవణం బంగారు నగల యాడ్ టివిలో రావడం చూసే వుంటారు కదా. అందులో పొట్టిగా నల్లగా ఉండే ఓ వ్యక్తి కి అటు ఇటు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఉంటారు. అబ్బో ఇతగాడికి ఇద్దరు అందమైన హీరోయిన్స్ యాక్ట్ చేసారేంటని ఆశ్చర్య పోతున్నారా? ఇంతకీ అతడు ఎవరై ఉంటారని అనుకుంటున్నారు ? ఆ విషయంలోకి వెళ్తే, ఈ యాడ్ లో కనిపించే వ్యక్తి శరవణ అరుళ్. ఇతని తండ్రి సైకిల్ పై కూరగాయలు అమ్మేవాడు. దీన్ని బట్టి యితడు ఎంతటి పేదరికం నుంచి వచ్చాడో చెప్పక్కర్లేదు. తండ్రి ఎంతోకష్టపడి పైసా పైసా కూడబెట్టి శరవణం స్టోర్స్ పెట్టాడు. కొద్దికాలానికే లాభాల బాట పట్టింది. ఇక కొడుకు అరుళ్ చేతికొచ్చాక టాప్ రేంజ్ కి వెళ్ళింది.

ఇక ప్రచారానికి పెద్దపీట వేసే అరుళ్ తన సంస్థ యాడ్ లో తానె నటిస్తాడు. ఇక ఇతనికి పెళ్ళైన అమ్మాయి ఉన్నా, ఇంకా కుర్రాడిగానే కనిపిస్తాడు. ఇక కూతురు పెళ్ళికి కొన్న గౌనుకి 13కోట్లు వెచ్చించాడు. అంటే పెళ్లి ఎంతగ్రాండ్ గా జరిపించాడో ఊహించవచ్చు. వజ్రాలు పొదిగిన ఈ గౌనుని ఫ్రెంచ్ డిజైనర్ల చేత తయారు చేయించాడు.

ఇక పెళ్లి విందుకు సూపర్ స్టార్ రజనీకాంత్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి వంటి ప్రముఖులు వచ్చారు.
ఇక ఒక్కో వ్యక్తి భోజనానికి సగటున 10వేల రూపాయల ఖర్చు అయిందట. ఇక అరుళ్ దగ్గర ఆరుకోట్ల రూపాయల విలువైన లేటెస్ట్ మోడల్ కారు లాంబోర్ధిని,8కోట్ల రూపాయల విలువైన బుకాటి వేరాన్,బిఎం డబ్ల్యు 7,జాగ్వార్ ఎస్ ఎఫ్,మూడు కోట్ల రూపాయల విలువచేసే ఫోర్షే,లేండ్ రోవర్ కార్లు ఉన్నాయి.

ఇక ఎవరైనా పెద్ద పెద్ద స్టార్స్ ని కంపెనీ యాడ్స్ కి ఎంచుకుంటారు. కానీ ఈయన డిఫరెంట్ గా తన యాడ్ లో తానే యాక్ట్ చేస్తాడు. అయితే తనపక్కన నటించడానికి మాత్రం ముద్దుగుమ్మలు ఎంచుకుంటాడు. అయితే ఈ యాడ్స్ వలన శరవణం స్టోర్స్ కి ఎంతపేరు వచ్చిందో తెలియదు గానీ హన్సిక , తమన్నాలతో యాడ్ లో యాక్ట్ చేసిన శరవణ అరుళ్ కి మాత్రం భారీ పబ్లిసిటీ వచ్చేసింది.