నాగార్జునతో ఆడి పాడిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కన్నా హీరోలకు ఎక్కువ లైఫ్ ఉంటుంది. హీరోలకు ఎంత వయస్సు వచ్చినా హీరోలుగా నటిస్తూ ఉంటారు. వారికీ అభిమానులు మరియు మార్కెట్ ఉంటుంది. అదే హీరోయిన్స్ అయితే వారికీ కొంత వయస్సు వరకే హీరోయిన్ గా మార్కెట్ ఉంటుంది. ఆ తర్వాత అమ్మ, అక్క, అత్త క్యారెక్టర్లు చేసుకోవాలి. ఆలా ఇష్టమైన వారు సినీ పరిశ్రమలో కొనసాగుతారు. అది ఇష్టం లేనివారు సినీ పరిశ్రమకు దూరం అయ్యి పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తారు. 1990 లో నాగార్జున హీరోగా వచ్చిన నేటి సిద్దార్ధ సినిమా గుర్తుంది కదా. అందులో ఓసి మనసా అనే పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసిన అయోషా జుల్కా గుర్తుంది కదా.
Ayesha Jhulka
ఆ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇటు తెలుగుతో పాటు హిందీలో అమీర్ ఖాన్ తో జో జీతా వహి సికిందర్ సినిమాలో నటించి దుమ్ము రేపింది. 2010 లో వచ్చిన అదా సినిమా తరువాత వెండితెరకు వీడ్కోలు పలికింది. మరల 8 సంవత్సరాల తర్వాత వెండితెరపై కన్పించటానికి సిద్ధం అవుతుంది.
Ayesha Jhulka  1
అయేషా జుల్కా అనీల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న జీనియస్ అనే బాలీవుడ్ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే హీరోయిన్ గా మాత్రం కాదు. హీరోయిన్ కి తల్లిగా నటిస్తుందట. ఇటీవలే మీడియాకు కనిపించిన అయోషా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.