ఈ హీరోని గుర్తు పట్టారా? ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సినీ ప్రపంచంలో హిట్ కొడితే అందలం ఎక్కిస్తారు. అదే ప్లాప్ అయితే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. కొంత మంది హీరోలు మొదట్లో హిట్స్ కొట్టిన ఆ తర్వాత పరాజయాలతో కనుమరుగు అయ్యిపోతున్నారు. అలాంటి హీరోలలో రోహిత్ ఒక్కడు. రోహిత్ అనగానే నారా రోహిత్ గుర్తుకు వస్తాడు. కానీ రోహిత్ అంటే 6 టిన్స్ సినిమాతో పరిచయం అయినా హీరో. ఆ సినిమా హిట్ అవ్వటంతో చిన్న సినిమాల దర్శకులకు వరంగా మారాడు రోహిత్. సొంతం,గర్ల్ ఫ్రెండ్,నవ వసంతం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Rohitరోహిత్ నటించిన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా హిట్ కావటమే కాకుండా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన శంకరుడదా mbbs, శంకరుడదా జిందాబాద్ రెండు సినిమాలలోనూ మంచి పాత్రలను పోషించాడు. . రోహిత్ చివరి సినిమా మా అన్నయ్య బంగారం. ఈ సినిమాలో రాజశేఖర్ కి తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా 2010 లో విడుదల అయింది. ఈ సినిమాల తర్వాత సినిమాల్లోనూ కన్పించలేదు అలాగే బయట ప్రపంచానికి కూడా దూరం అయ్యాడు. అసలు ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు.
Rohitఅయితే ఇంత కాలం అయ్యాక సడన్ గా ఒక ఫంక్షన్ లో కన్పించాడు రోహిత్. అయితే రోహిత్ ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయాడు. ఎవరో గుర్తుపట్టి రోహిత్ అనగానే అందరు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రోహిత్ రూపం పూర్తిగా మారిపోయింది. గుబురు గడ్డంతో శరీరంపై ఎటువంటి శ్రద్ద లేకుండా ఉన్నాడట. అతన్ని చూడగానే మరల సినిమాల్లో నటించే ఉద్దేశం లేనట్టే కన్పించాడట. అయితే రోహిత్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఏమి చేస్తున్నాడో మాత్రం వివరాలు ఏమి తెలియలేదు.