గూఢచారి పెట్టుబడి,రాబడి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
అడవి శేషు సినిమాలు తక్కువ చేసిన చేసిన సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య క్షణం సినిమాతో కమర్షియల్ హిట్ సాధించిన అడవి శేషు ఇప్పుడు తాజాగా గూఢచారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన గూఢచారి సినిమా మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని రాబట్టేసింది. ఈ సినిమా విడుదల సమయంలో పోటీ లేకపోవటం మరియు బడ్జెక్ట్ తక్కువ కావటంతో తొందరగా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఈ సినిమాను కేవలం 5.5 కోట్లతో నిర్మించినట్టు తెలుస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన కారణంగా చాలా త్వరగా బడ్జెట్ రికవరీ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్న కారణంగా ఈ సినిమా నిర్మాతకు పెట్టుబడికి రెండు రెట్లు లాభం వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఓవర్సీస్లో ఈ చిత్రం దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలను వసూళ్లు చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. మొదటి మూడు రోజుల్లోనే సినిమా పెట్టుబడిని వసూళ్లు చేయడంతో ఇంకా భారీగా వసూళ్లు నమోదు అవుతాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ వారం మొత్తంలో మరో అయిదు కోట్ల రూపాయలను వసూళ్లు చేయనుందని, ఇక శాటిలైట్ రైట్స్ మరియు ఆన్లైన్ రైట్స్ ద్వారా, రీమేక్, డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో అయిదు కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్ర నిర్మాతకు పది కోట్ల మేరకు లాభం చేకూరబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
పెట్టిన అయిదు కోట్ల పెట్టుబడికి 15 కోట్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి గూఢచారి సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతున్నందుకు అడవి శేషు ప్రధాన కారణం అని, సుప్రియ ఈ సినిమాలో నటించడం కూడా సినిమాకి ప్లస్ అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సుప్రియ కూడా దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఆమెకు కూడా మంచి పేరు వచ్చింది.