యజ్ఞం సినిమాలో గోపీచంద్ తో ఆడి పాడిన సమీరా బెనర్జీ ఇప్పుడు ఏ పాత్రలు చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

సినీ పరిశ్రమలో హీరోలదే హవా అని చెప్పాలి. హీరోలు వయస్సుతో సంబంధం లేకుండా హీరోగా చాలా కాలం పాటు కొనసాగుతారు. అయితే హీరోయిన్స్ పరిస్థితి దీనికి బిన్నంగా ఉంటుంది. హీరోయిన్స్ గ్లామర్ గా ఉన్నంత వరకే వారికీ హీరోయిన్స్ గా అవకాశాలు వస్తాయి. ఏ హీరోయిన్ అయినా పరిశ్రమలో పది సంవత్సరాలు ఉందంటే అది గొప్ప విషయం అని చెప్పాలి. హీరోయిన్ కి ప్లాప్ ముద్ర పడిన సక్సెస్ రేటు లేకపోయినా మరియు ఏ మాత్రం గ్లామర్ లో తేడా వచ్చిన ఫెడ్ అవుట్ అయ్యిపోతారు. ఆలా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో సమీరా బెనర్జీ ఒకరు. ఆమె యజ్ఞం సినిమాలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ని అందుకుంది.

సమీరా స్వస్థలం కలకత్తా. ఆమెకు చిన్నతనము నుండి సినిమాలపై పిచ్చి ఉండటంతో టీనేజ్ లో వందకు పైగా యాడ్స్ లో నటించింది. కొన్ని బంగాదేశ్ సినిమాల్లో కూడా నటించింది. అదే సమయంలో నార్త్ ఇండియాలో హిందీ సీరియల్స్ హవా ప్రారంభం అయింది. బాలాజీ టెలి ఫిలిమ్స్ వంటివి సినిమాలను తీసిన భారీ స్థాయిలో టివి సీరియల్స్ నిర్మించటం ప్రారంభించాయి.

ఆలా సమీరా హిందీ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ సీరియల్ హిట్ కావటంతో యజ్ఞం సినిమాలో గోపీచంద్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ సినిమా హిట్ కావటంతో గోల్డెన్ లెగ్ అని అనిపించుకుంది. అయితే యజ్ఞం సినిమా హిట్ అయినా సరే సమీరాకు అవకాశాలు రాలేదు.

దాంతో సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు అపరిచయం అయినా నిర్మాత నిరోష్ శర్మను వివాహం చేసుకుంది. వీరికి కొడుకు పుట్టాక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమీరాకి టివి రంగం షాక్ ఇచ్చింది.

ఆమెకు హీరోయిన్ పాత్రలు ఇవ్వలేమని అత్తగారు,బామ్మగారు పాత్రలు ఇవ్వటం మొదలు పెట్టారు. సమీరా కూడా పరిస్థితిని అర్ధం చేసుకొని ఏ పాత్ర అయినా చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతుంది.