5 కోట్లతో తీసిన గీతా గోవిందం కలెక్షన్స్ ఎన్ని కొట్లో చూస్తే షాక్ అవ్వాల్సిందే

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం విడుదల అయినా మొదటి ఆట నుండే బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తనలో ఫన్నీ కోణం కూడా ఉందని నిరూపించుకున్నాడు. పరుశరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందాన నటించింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చివరకి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో హాస్యానికి ఫిదా అవుతున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఫెర్ఫామెన్స్ కి మహేష్ బాబు,అల్లు అర్జున్,రామ్ చరణ్ లు సైతం విజయ్ ని మెచ్చుకున్నారు.

ఈ సినిమాకి నిర్మాతలు అయినా అల్లు అరవింద్,బన్నీ వాసు లాభాల బాట పట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి వచ్చేసిందట. ఇక ఇప్పటి నుండి వచ్చే ప్రతి పైసా లాభమే అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల అయ్యి ఈ రోజుకి నాలుగు రోజులు మాత్రమే. ఇంకా ఈ సినిమా హవా నెల రోజుల పాటు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మొదటి మూడు రోజుల్లోనే 18 కోట్ల షేర్ సాధించిందంటే సినిమా ఎలా ఉందో అర్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు రాబట్టిన గీతా గోవిందం పొరుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల సునామి సృస్తిస్తుంది. తమిళనాడులో 98 లక్షలు,కర్ణాటకలో కోటి నాలుగు లక్షలు, అమెరికాలో 3 కోట్ల షేర్ వసూలు చేసింది. గీతా గోవిందం సినిమా సక్సెస్ మీట్ ని ఆదివారం నిర్వహించటానికి చిత్ర బృందం ఏర్పాట్లను చేస్తుంది. ఈ సక్సెస్ మీట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్నారు.