శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ పార్టీ కోసం వేసుకున్న ఈ డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ధడక్‌ సినిమాతో బాలీవుడ్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. జాన్వీకి సంబంధించి ప్రతి వార్తనూ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇటీవల ముంబైలో ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ తన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ పార్టీకి జాన్వీ ఎరుపు రంగు సిల్క్‌ క్రీప్‌ బటన్‌ అప్‌ షర్ట్‌, అదే కలర్‌ ట్రౌజర్స్‌తో హాజరై మెస్మరైజ్‌ చేశారు. రెడ్‌ డ్రెస్‌తో పాటు నలుపు రంగు బ్యాగ్‌, యాక్సెసరీస్‌తో స్టన్నింగ్‌ లుక్‌లో మెరిశారు. జాన్వీ డ్రెస్‌ ఖరీదు భారతీయ కరెన్సీలో రూ లక్ష రూపాయిలు కావడం గమనార్హం.