కాఫీ మంచి రుచిగా రావాలంటే… ఈ చిన్న చిట్కా ట్రై చేయండి

కాఫీ మంచి రుచిగా ఉండాలంటే కాఫీ డికాషన్ చేసినప్పుడు చిటికెడు ఉప్పు వేయాలి. అప్పుడు కాఫీ చాలా రుచిగా ఉంటుంది.

వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజాగా,మంచి వాసన,ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెన్న కాసేటప్పుడు ఒక తమలపాకు వేస్తె సరిపోతుంది.

కొత్తిమీర,పుదీనా పచ్చడి చేసినప్పుడు కొంచెం పెరుగు కలిపితే పచ్చడికి మంచి రుచి వస్తుంది.

ఆపిల్ ముక్కలను కోసినప్పుడు తొందరగా ఎర్రగా మారిపోతాయి. ఆలా మారకుండా ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే ఆపిల్ ముక్కల మీద నిమ్మరసం రాయాలి.

క్యాబేజి కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం పిండితే కూర రుచి పెరగటమే కాకుండా వాసన రాకుండా ఉంటుంది.

కూరలు వండేటప్పుడు నూనెలో కొంచెం పసుపు వేస్తె కూరల సహజరంగు కోల్పోకుండా ఉంటాయి.

ఆకుకూరలను ఉడికించిన నీటిని పాడేయకుండా సూప్ ల తయారీలో వాడుకోవచ్చు.

ప్లాస్క్ లను ఎంత శుభ్రం చేసిన దుర్వాసన వస్తూ ఉంటాయి. ఆ దుర్వాసన పోవాలంటే ప్లాస్క్ ని మజ్జిగతో కడగాలి.

బొంబాయి రవ్వతో ఉప్మా చేసినప్పుడు రవ్వ ఉండ కట్టకుండా ఉండాలంటే రవ్వకు ఒక స్పూన్ నూనెను పట్టించాలి.

కూరల్లో ఉప్పు,కారం ఎక్కువ అయినప్పుడు ఒక స్పూన్ శనగపిండిని వేగించి కలిపితే కూరల్లో ఉప్పు,కారం తగ్గటమే కాకుండా మంచి రుచి వస్తుంది.

వంటగదిలో చీమలతో చాలా ఇబ్బంది పడుతున్నారా? చీమలు ఉన్న చోట నిమ్మరసం జల్లితే చీమలు పారిపోతాయి.

బంగాళాదుంప,అరటికాయ ముక్కలు వేగించటానికి అరగంట ముందు ఉప్పు జల్లి పక్కన పెట్టాలి. అరగంట అయ్యాక వేగిస్తే బాగా వేగుతాయి.