కళ్యాణ్ బాబాయ్ వల్లే మేము గొడవలు పడేవాళ్ళం… షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా డాటర్స్

టాలీవుడ్ లో మెగా అభిమానులకు ఆగస్టు 22 పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. చిరు సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపుగా పది సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తనలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని చేసి చూపించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరు కూతుళ్లు సుస్మిత,శ్రీజ మెగా కుటుంబానికి సంబందించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. సుస్మిత మాట్లాడుతూ శ్రీజ చాలా కామ్ గా ఉండేదని, నేను అన్నయ్య చరణ్ అల్ల్లరి చేసేవాళ్ళం. శ్రీజ సైలెంట్ గా ఒక పక్కన కూర్చునేది. నేను అన్నయ్య గొడవ పడుతూ ఉంటే కళ్యాణ్ బాబాయ్ మమ్మల్ని ఎంకరేజ్‌ చేసేవారు. ఏదో ఒకటి చెప్పి మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవారు. ఆలా మాతో కలిసి అల్ల్లరి చేసేవారు. ఇంట్లో ఆయనకు మా గొడవలు ఫన్‌ అన్నమాట. మా ముగ్గురిలో శ్రీజ బాగా చదివేది.

ఇక శ్రీజ మాట్లాడుతూ అక్క,అన్నయ్య గొడవ పడుతూ ఉంటే నాకేమి సంబంధం లేనట్టు పక్కన ఆలా కుర్చునేదాన్ని. నేను చిన్న పిల్లను కావటంతో అందరూ ముద్దు చేసేవారు. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గ్రాడ్యుయేషన్‌ చేశాక లండన్‌ వెళ్లి మాస్టర్స్‌ చేశా. ఒక టైమ్‌లో స్పోర్ట్స్‌ ఎక్కువ ఆడేదాన్ని, బాడ్మింటన్‌ నేషనల్‌ లెవల్స్‌కి వెళ్లా’’ అంటూ చెప్పుకొచ్చింది.