లవర్ బాయ్ తరుణ్ తండ్రి ఒకప్పటి స్టార్ హీరో, ఛానల్ హెడ్ అని మీకు తెలుసా?

తరుణ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నువ్వే కావాలి అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.  సరైన కథల ఎంపిక చేసుకోలేకపోవడం వలన ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేయలేక ప్లాప్స్ మూట కట్టుకున్నాడు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత తన మార్కు అయినా ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధం అవుతున్నాడు. తరుణ్ తల్లి రోజారమని అన్న విషయం మనకు తెలిసిందే. ఆవిడ హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత సక్సెస్ ఫుల్ అయ్యిందో కూడా మనకు తెలిసిందే.

Tarun fatherతరుణ్ తండ్రి చక్రపాణి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తరుణ్ తండ్రి అసలు పేరు రామకృష్ణ. అయన ఒరిస్సాలో పుట్టారు. ఒకసారి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మహా నటుడు బాలయ్యగారు చూసి సినిమాల్లో ట్రై చేయవచ్చు కదా అని అనడంతో చెన్నయ్ వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేసి కొన్ని సినిమాల్లో హీరోగా చేసారు. అయితే ఆ సినిమాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. చక్రపాణి అయన మాత్రిభాష ఒరియాలో హీరోగా చాలా సినిమాలు చేసారు. ఆ తర్వాత వ్యాపారం చేసి బాగా నష్టపోయారు.
Tarun familyఆ సమయంలో రామోజీరావు ని కలవటం అయన చక్రపాణికి  ఒరియా లో ఈ టీవీ బాధ్యతలు అప్పగించటం చకచకా జరిగిపోయాయి. ఆ ఛానల్ ని చాలా సక్సెస్ గా రన్ చేసారు. ఆ తర్వాత తెలుగులో మంచి హిట్ అయినా సినిమాలను ఒరియాలో రీమేక్ చేసి కోట్లు గడించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో పెట్టి మరింత సంపాదించారు. చక్రపాణి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సంపాదించారు.