పెళ్ళిసందడి సినిమాలో సందడి చేసిన హీరోయిన్ దీప్తీ భట్నాగర్‌ ఇప్పుడు ఏ రంగంలో స్థిరపడిందో తెలుసా?

పెళ్ళిసందడి సినిమాలో దీప్తీ భట్నాగర్‌ స్వప్న సుందరిగా ప్రేక్షకుల మదిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా 22 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పటికి దీప్తీ భట్నాగర్‌ చూసినప్పుడల్లా చాలా మందికి ‘సౌందర్యలహరీ…’ పాట గుర్తుకువస్తుందంటే అతిశయోక్తి కాదు. యాభయ్యేళ్ల వయసులోనూ ఆమె అందం తరగలేదు. తెలుగుతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించిన దీప్తీ భట్నాగర్‌ తర్వాత నిర్మాతగా, యాంకర్‌గా మారి హిందీ ఛానెళ్లలో యాత్రలకు సంబంధించిన షోలను చెయ్యడం ప్రారంభించింది. అలా 2001లో వచ్చిన ‘యాత్ర,’ ‘ముసాఫిర్‌ హూ యారో’… షోలు దీప్తికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ‘ముసాఫిర్‌ హూ యారో’ కార్యక్రమంలో భాగంగా దీప్తి ఆరేళ్లలో ఎనభైదేశాలను చుట్టొచ్చిందంటేనే అది ఎంత విజయవంతం అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ షో తీస్తున్న సమయంలోనే దాని దర్శకుడు రణ్‌దీప్‌ ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈ స్వప్న సుందరి సొంత కంపెనీ ‘దీప్తీ భట్నాగర్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పనుల్ని చూసుకోవడంతో పాటు ‘ట్రావెల్‌ విత్‌ దీప్తీభట్నాగర్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఛానెల్‌నూ నిర్వహిస్తూ బిజీగా ఉంది.