సంతోషం సినిమాలో నాగార్జునతో ఆడి పాడిన గ్రేసీ సింగ్ సినిమాలకు దూరంగా ఏమి చేస్తుందో తెలుసా?

సంతోషం సినిమాలో నాగార్జునతో జోడి కట్టిన గ్రేసీ సింగ్ గుర్తు ఉందా? ఆమె తన అందం,అభినయంతో కుర్రకారు గుండెలో గుబులు పుట్టించింది. తెలుగులో ఈ భామ పెద్దగా సినిమాలు చేయలేదు. హిందీ సినిమాలతో బిజీ అయ్యిపోయి ఇక తెలుగు తెర మీద కన్పించలేదు. గ్రేసీ ఎనిమిదేళ్ల కిందట ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాతో మరోసారి తెలుగు తెరమీద కనిపించిందంతే. ఇంతకీ గ్రేసీ సింగ్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. గత సంవత్సరం వరకు ‘సంతోషీ మా’ అనే హిందీ సీరియల్‌లో అమ్మవారిగా కనిపించింది. గ్రేసీ భరతనాట్యం డాన్సర్‌ కూడా. అందుకే, ‘గ్రేసీ సింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’ని ప్రారంభించి భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తోంది.

దీనికి తోడు తరచూ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. ఈ మధ్యే ముంబైలోని ఓ వీధిని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వీధుల్లోని గోడలకు రంగులేస్తూ కనిపించింది. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ వారి కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. ఏది ఏమైతేనే ఈ భామ సినిమాలకు దూరంగా గడిపేస్తుంది.