ఇది గమనించారా…. పవన్ సైరా సెట్స్ లో ఎందుకు ఉన్నారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా సురేఖ సమర్పణలో సైరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కాయం సైరా సెట్ లోకి వెళ్లిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని అర్ధం అవుతుంది. సైరా సినిమా షూటింగ్ ప్రారంభించిన మొదట్లో తీసుకున్న ఫోటో. ఈ ఫొటోలో చిరంజీవి,పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడు సూపర్ స్టార్ అమితాబ్ కూడా ఉన్నారు. చిరంజీవి,అమితాబ్ సినిమా పాత్రల్లో ఉండగా పవన్ మాత్రం క్లిన్ షేవ్ గా కన్పిస్తున్నారు. సైరా షూటింగ్ చూడటానికి,అన్నయ్యను కలవటానికి పవన్ కళ్యాణ్ సైరా సెట్ కి వెళ్లారు.

ఆ ఫోటోలో రామ్ చరణ్,సత్యానంద్ కూడా ఉన్నారు. ఈ ఫోటోను చిరంజీవి ఫ్రేమ్ కట్టించి సత్యానంద్ కి పంపారట. సత్యానంద్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సైరా సినిమా వచ్చే వేసవిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల అయినా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చుసిన చిరు అభిమానులలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సైరా సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.