కౌశల్ ఆర్మీ గురించి బిగ్ బాస్ హౌస్ లో లీక్ చేసిన శ్యామల …శ్యామల కి శిక్ష ఏమిటో .!

బిగ్ బాస్ లో గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్ది రోజుకొక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. షోకి ముగియటానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి రోజు పార్టిసిపెంట్స్ కి కీలకమే. ఏ మాత్రం తప్పు చేసిన భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే.బిగ్ బాస్ కూడా గేమ్ ని చాలా ఆసక్తికరంగా,ఎవరి ఊహకి అందని రీతిలో నడిపిస్తున్నాడు. మొన్న వెకెండ్ లో రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో పూజ ఎలిమినేట్ అయ్యి నానితో పాటు బయటకు వెళ్ళింది. తర్వాతి రోజు నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నామినేషన్స్ లో భాగంగా ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్లేందుకు అమిత్ , కౌశల్ , గణేష్ , సామ్రాట్ , నూతన్ నామినేట్ అయ్యారు . ఈ నామినేషన్స్ పక్రియ పూర్తికాగానే శ్యామల . గీత , సామ్రాట్ , తనీష్ ఒక చోటే కూర్చొని మాట్లాడుతున్నారు .

ఇక్కడే శ్యామల అతి పెద్ద తప్పుచేసిందని బిగ్ బాస్ తో పాటు , బిగ్ బాస్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. శ్యామల తనీష్ ,గీత ,సామ్రాట్ తో మాట్లాడుతూ బయట వున్న కౌశల్ ఆర్మీ గురించి చెప్పేసింది . నూతన్ నాయుడు ఇంట్లోకి రావటానికి ముఖ్య కారణం కౌశల్ అభిమానులే అని చెప్పింది,మళ్ళీ హౌస్ లోకి రావటానికి క్యాంపైన్ చేసుకునే టప్పుడు కౌశల్ పై గుడ్లతో దాడి చేసినవారిని చీల్చి చెండాడుతా నన్ను ఇంట్లోకి పంపించండి అని క్యాంపైన్ చేసుకున్నాడని , అందుకే అయన బయటనున్న పరిస్థితిని బట్టి గేమ్ ఆడుతున్నడని శ్యామల వారికీ చెపింది .

తరువాత వారందరు మాట్లాడుతూ ,,బయటవిషయాలు తెలిసినందువల్లే నూతన్ నాయుడు కౌశల్ కి మద్దతుగా హౌస్ లో ఉంటున్నాడా అని అన్నారు . అందుకోసమే హౌసెమెట్స్ అందరూ కౌశల్ ని వ్యతిరేకిస్తున్న కూడా నూతన్ కౌశల్ కి సపోర్ట్ గా నిలిస్తున్నాడని చెప్పింది.

బిగ్ బాస్ రూల్స్ ప్రకారం శ్యామల బయటజరిగిన ఏ విషయాన్ని కూడా హౌస్ మేట్స్ తో డిస్కర్స్ చేయకూడదు , కానీ ఆమె కౌశల్ ఆర్మీ గురించి అందరికి చెప్పింది . ఈ విషయం లో శ్యామల పై బిగ్ బాస్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.