సైరా సినిమాలో పాటలు ఎలా ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు

చిరంజీవి ముఖ్య పాత్రలో స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. సైరా సినిమాకి సంబంధించి విడుదల అయినా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఇచ్చిన బీజీయం హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. సైరా స్వతంత్ర సమరయోధుని కథ. ఆ కాలానికి తగ్గట్టుగా సంగీతం ఉండబోతున్నది. పైగా సైరా నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ మాండలికంలోనే పాటలు ఉండబోతున్నాయని.. అవి కూడా జానపదగీతాల టైప్ లో పాటలు ఉంటాయని వినికిడి. కథ ప్రకారం సైరాకు ఇద్దరు భార్యలు .. మరి వీరితో ఏమైన ప్రణయ గీతాలు ఉంటాయా లేదా అన్నది తెలియాలి. సంగీతం విషయంలో చాలా కేర్ తీసుకున్నదట యూనిట్.