బిగ్ బాస్ లో కౌశల్,గీతాల మధ్య యుద్ధం ఎంత దూరం వెళుతుందో? రచ్చ మాములుగా లేదుగా?

బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్ది రోజు కొక ఆసక్తికరమైన విషయం హౌస్ లో జరుగుతుంది. హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. షోకి ముగియటానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి రోజు పార్టిసిపెంట్స్ కి కీలకమే. ఏ మాత్రం తప్పు చేసిన భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే. దాంతో ప్రతి పార్టిసిపెంట్ తమ ఆటపై దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరిలోనూ బిగ్ బాస్ టైటిల్ గెలవాలనే కసి కనపడుతుంది.ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కూడా అయిపోవడం తో అందరూ తమ తమ గేమ్ ని రక్తి కట్టించటానికి సిద్ధమయ్యారు . ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్స్ లో కౌశల్ , నూతన్ , గణేష్ , సామ్రాట్ , అమిత్ లు ఉన్నారు . ఇక పొతే గత కొన్ని రోజులుగా హౌస్ లో గీత మాధురి , కౌశల్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అని అందరికి తెలిసిందే .

కౌశల్ , గీత ఎన్ని సార్లు మాట్లాడుకున్న కూడా మళ్ళీ వారిద్దరి మధ్య పొరలు ఏర్పడుతూనే ఉన్నాయి . దీనితో గీత కొన్ని రోజుల నుండి కౌశల్ కి కొంచెం దూరంగా ఉంటూ వస్తుంది.ఇక అసలు విషయానికొస్తే …ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా గీత మాధురి , కౌశల్ మధ్య పెద్ద రచ్చ జరిగిందని తెలుస్తుంది . తాజా ప్రోమో చూస్తేంటే ..ప్రోమో లో చూసిన విధంగా కౌశల్ గీత పై విరుచుకుపడుతున్నాడు. గీత మాట్లాడుతూ ప్రతిసారి మీ సింపతీ కోసం నను ఎందుకు బలి చేస్తారని చెప్పింది . ఎన్నిసార్లు మీకు సపోర్ట్ చేసిన కూడా నన్ను వంటరివాన్ని చేసారని అంటుంటారని గీత కూడా కౌశల్ పై ఫైర్ అవుతుంది .

అలాగే ఇంటి సభ్యులు కూడా వారిని ఎంత ఆపాలని ప్రయత్నం చేసిన కూడా వారు అదేం లెక్కచేయకుండా మాటల యుద్దాన్ని కొనసాగించారు . తాజా ప్రోమో చూస్తే ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ మరింత ఆసక్తిని పెంచుతుందనడం తప్పుకాదనిపిస్తుంది . చూడాలి మరి ఈ మాటల యుద్ధం ఎవరికీ ఫెవర్ గా మారబోతుందో …