గణేష్ పై విరుచుకుపడ్డ కౌశల్….కారణం ఏమిటో తెలుసా?

బిగ్ బాస్ లో గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్ది రోజుకొక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. షోకి ముగియటానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి రోజు పార్టిసిపెంట్స్ కి కీలకమే. ఏ మాత్రం తప్పు చేసిన భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే. బిగ్ బాస్ కూడా గేమ్ ని చాలా ఆసక్తికరంగా,ఎవరి ఊహకి అందని రీతిలో నడిపిస్తున్నాడు. మొన్న వెకెండ్ లో రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో పూజ ఎలిమినేట్ అయ్యి నానితో పాటు బయటకు వెళ్ళింది. తర్వాతి రోజు నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఒక పార్టిసిపెంట్ ని ఒక వైపు ,మరో వైపు ముగ్గురు పార్టిసిపెంట్స్ ని కూర్చోబెట్టి వారిలో ఒకరిని నామినేట్ చేసి ఇద్దరిని సేవ్ చేయాలనీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో కౌశల్ ఏ మాత్రం భయపడకుండా తన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేకుండా ఏది చెప్పాలని అనుకున్నాడో అదే చెప్పుతూ గణేష్ పై విరుచుకుపడ్డాడు. నీవు ఇంటిలో సోమరిపోతుగా ఉన్నావు. ఇంటిలో ఉండటం వెస్ట్ అని కౌశల్ గణేష్ పై రెచ్చిపోయాడు. నువ్వు సామాన్యుడు అని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావ్ అన్నాడు.

ఎప్పుడు సైలెంట్ గా ఉండే కౌశల్ ఒక్కసారిగా గణేష్ మీద విరుచుకుపడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గణేష్ కూడా కౌశల్ ని ఎదో అనే ఉంటాడని అందరు భావించారు. హౌస్ నుంచి బాబు బయటకు వెళ్లిన తర్వాత గణేష్ కౌశల్ మీద వ్యతిరేకత చూపిస్తున్నాడు. గణేష్ ప్రవర్తన కౌశల్ ఆర్మీకి నచ్చలేదు. గణేష్ ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వస్తాడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు కౌశల్ ఆర్మీకి అవకాశం వచ్చింది. గణేష్ ఎలిమినేషన్ లోకి రావటంతో ఇక ఇంటికే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.