బిగ్ బాస్ ఓటింగ్ లో తెర వెనక మతలబు… కౌశల్ ఆర్మీ సీరియస్… ఏమి జరుగుతుందో?

బిగ్ బాస్ రెండో సీజన్ చివరి దశకు వచ్చేసింది. దాంతో దీనికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఎదో తెర వెనక మతలబు జరుగుతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కౌశల్ విషయంలో బిగ్ బాస్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక నామినేట్ ప్రక్రియ మొదలు అయింది. నామినేషన్ ప్రక్రియ కూడా చాలా సేపు జరిగింది. నామినేషన్ ప్రక్రియ ముగిసాక అభిమానులు పార్టిసిపెంట్స్ ఓట్లు వేస్తూ ఉంటారు. ఈ సారి కౌశల్ నామినేట్ కావటంతో ఓటింగ్ చేయటానికి కౌశల్ ఆర్మీ రెస్పాండ్ అయ్యి ఓటింగ్ చేద్దామని అనుకుంటే అనుకోని షాక్ ఎదురయింది.

టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాలేదు. దానికి తోడు గూగుల్ పోల్ లో కూడా సేమ్ ఇష్యూ ఎదురైంది. గూగుల్ లో ఓట్లేద్దామని చూసిన నెటిజన్లకు అక్కడ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ దర్శనమిచ్చాయి. అవి కూడా కౌశల్ కు యాంటీగా ఉన్న ఆర్టికల్స్ కావడంతో కౌశల్ అభిమానులు మండిపడుతున్నారు.

నామినేషన్స్ కంప్లీట్ అయినవెంటనే ఓటింగ్ సిస్టమ్ ఓపెన్ కావాలి. కానీ ఎన్ని కాల్స్ చేసినా కనెక్ట్ కాని పరిస్థితి నెలకొంది. గూగుల్ లోనూ అదే పరిస్థితి ఎదురవడంతో కౌశల్ ఆర్మీ సీరియస్ గా తీసుకుంది. కాల్ కనెక్ట్ అవదు… పోల్ ఓపెన్ అవదు.

ప్రోమోస్ నెగెటివ్ గా చూపిస్తారు… గూగుల్ లో ఓట్ వేద్దామని వెళితే నెగెటివ్ ఆర్టికల్స్ సెట్ చేసి ఉంచారు…ఓటింగ్ లైన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి… చూస్తుంటే ఇదేదో పక్కా ప్లాన్ తో చేసినట్టు అనుమానం వస్తోంది.