హరికృష్ణ మృతికి అసలు కారణాలు ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

టీడీపీ ముఖ్యనేత, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఘోర రోడ్డుప్రమాదంలో కన్నుమూయడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎవరూ ఊహించని సంఘటన కావడంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కొన్నిరోజుల క్రితమే హరికృష్ణ హీరో రాజశేఖర్ బంధువుల ఇంట జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు.హీరో రాజశేఖర్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ ఫంక్షన్ లో ఎంతో ఉత్సాహంగా కనిపించారు నందమూరి హరికృష్ణ. ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ మృత్యువాత పడ్డారు. దీనిపై నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. మితిమీరిన వేగం కారణంగానే నందమూరి హరికృష్ణ కారుకు ప్రమాదం జరిగినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నంబర్ ఏపీ28 బీడబ్ల్యూ 2323 అని గుర్తించాం. ఆయన నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి వెళుతున్నట్టు తెలిసింది… బుధవారం వేకువజామున 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో హరికృష్ణ తన నివాసం నుంచి బయల్దేరారు… ఉదయం కల్లా నల్గొండ జిల్లాలో ప్రవేశించి నార్కెట్ పల్లి-అద్దంకి హైవేపైకి ఎంటరయ్యారు.

ఆ సమయంలో హరికృష్ణ కారును స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. అప్పటికే కారు ఓవర్ స్పీడ్ లో ఉంది… అన్నేపర్తి సమీపించగానే కారు కంట్రోల్ తప్పింది. డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో హరికృష్ణ కారు గాల్లోనే పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కు

వగా ఉండడంతో డ్రైవర్ సీట్లో ఉన్న హరికృష్ణ సుమారు 30 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు… ప్రమాదం జరిగిన ఐదు నిమిషాల్లోనే ఆయనను నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయనపరిస్థితి మరింతగా విషమించింది. డాక్టర్లు ఎంత కృషిచేసినా హరికృష్ణను బతికించలేకపోయారు.

కారులో ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరు పరిస్థితి నిలకడగానే ఉంది. కారును డ్రైవ్ చేస్తున్న నందమూరి హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్ ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి… అని ఎస్పీ రంగనాథ్ వివరించారు.