ఇప్పుడు మాకు దిక్కెవ్వరు అంటూ … భోరున విలపిస్తున్న ఎన్టీఆర్ తల్లి శాలిని.

నందమూరి హరికృష్ణ మరణంతో సినీ, రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతున్న హరికృష్ణ నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఓ రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందారు. స్వయంగా కారు నడుపుతున్న ఆయన ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. డివైడర్ ను బోల్తా కొట్టి అవతల నుంచి వస్తున్న మరో కారు ఎదుట పడిపోయింది హరికృష్ణ కారు. దాంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటన జరిగిందని తెలియగానే మొదట ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఆసుపత్రికి తరలించారని, చికిత్స జరుగుతోందని వార్తలు వచ్చాయి.
Actor Nandamuri Harikrishna
కానీ ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ బయటికి రావడంతో హరికృష్ణ బతకడం దాదాపు కష్టమే అని భావించారు. ఘటనస్థలానికి పక్కనే పొలాల్లో ఉన్న రైతులు వచ్చి ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు పోయినట్టు తెలుస్తోంది. భర్త మరణంతో నందమూరి హరికృష్ణ సతీమణి శాలిని షాక్ కు గురైంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో భయపడుతూనే ఈ విషయం చెప్పాడట తల్లికి.

మొదట చిన్న యాక్సిడెంటే అని చెప్పిన ఎన్టీఆర్, కాసేపటి తర్వాత అసలు విషయం చెప్పేశాడట. దాంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలిపోయిందట. సృహ కోల్పోయిన తల్లిని చూసి ఎన్టీఆర్ తీవ్ర ఆందోళనకు గురవగా, కాసేపటి తర్వాత ఆమె తేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడట.అనంతరం ఆమె పెద్దపెట్టున రోదిస్తూ… నువ్వు పోయిన తర్వాత నాకు దిక్కెవరు అంటూ విలపించడం కుటుంబ సభ్యులను కలచివేసింది.

కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని, ఎంతో బాధల్లో ఉన్న శాలినికి ఓ జీవితం ఇచ్చారు నందమూరి హరికృష్ణ. ఒకరకంగా అనాథ లాంటి జీవితం గడుపుతున్న శాలినికి ఓ అందమైన కుటుంబం, హోదా, పరువుప్రతిష్ట, డబ్బు అన్నీ ఇచ్చారు హరికృష్ణ. అప్పటికే ఆయనకు పెళ్లయి ఉన్నా, ఇచ్చిన మాట కోసం శాలినిని పెళ్లి చేసుకున్నారు.

నందమూరి కుటుంబంలో కోడలు కావడం అంటే అది ఎంతో గొప్పవాళ్లకు మాత్రమే సాధ్యం అనుకునే రోజుల్లో ఓ సామాన్యురాలికి ఆ హోదా కట్టబెట్టడం హరికృష్ణ సహృదయతకు నిదర్శనం. అందుకే ఆమె తన భర్త హరికృష్ణకు సదా విధేయురాలై ఉంటుంది. కానీ ఇప్పుడు హరికృష్ణ తమను అర్థంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో కోలుకోలేకపోతోంది. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇంతటి ఉపద్రవం రావడంతో తట్టుకోలేపోతోంది శాలిని. తండ్రి పోయిన దుఃఖంతో తల్లడిల్లిపోతున్న కొడుకును చూసి మరింతగా శోకిస్తోంది.