యంగ్ టైగర్ ఇంట్లో తీవ్ర విషాదం….నందమూరి హరికృష్ణ మృతి…ప్రమాద దృశ్యాలు

సినీ,రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయన నెల్లూరు నుండి హైదరాబాద్ వస్తూ ఉండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. కారులో నుంచి బయట పడిన హరికృష్ణకు తలకు,శరీరానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని భావిస్తున్నారు. అయితే ప్రమాద స్థలంలో రెండు వాహనాలు ఉండటంతో కారు వేగంగా వెళ్లి పల్టీలు కొట్టిందా….లేదా ముందు వెళుతున్న కారును డీకొట్టిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

కారు ప్రమాదానికి గురి అయినప్పుడు హరికృష్ణ డ్రైవ్ చేస్తున్నట్టు సమాచారం. అయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అనే విషయం కూడా తెలియలేదు.