కౌశల్ ఆర్మీ అంతా బూటకం…. నిజాలు బయట పెడతానంటున్న బాబు గోగినేని

బిగ్ బాస్ రెండో సీజన్ లో బాబు గోగినేని ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. హౌస్ లో ఉన్నప్పుడు బిగ్గర్ బాస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు కౌశల్ తో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నాడు. బాబు గోగినేని ఎక్కువ వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయినా ప్రతి ఒక్కరు ఎదో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ హౌస్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్ బిగ్ బాస్ ఆదేశాల మేరకు మాత్రమే పనులను చేయాలి. హౌస్ లో పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నా అది బిగ్ బాస్ ప్లానింగ్ అయ్యి ఉంటుంది. అంతేకాక కౌశల్ తో విభేదాల గురించి, కౌశల్ ఆర్మీ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు బాబు గోగినేని. కౌశల్ ఆర్మీ గురించి తీవ్రంగా విమర్శలు చేసారు.

ఒక వ్యక్తికీ ఆర్మీ అంటూ ఏర్పాటు అవ్వటం కరెక్ట్ కాదని అన్నారు బాబు గోగినేని. బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయ్యిన రెండు వారాల్లోనే కౌశల్ ఆర్మీ ఇంత భారీ స్థాయిలో బిల్డప్ అవ్వటం సాధ్యం కాదని ముందు నుంచే పక్కా ప్రణాళికతో కౌశల్ ఆర్మీని బిల్డప్ చేసి ఉండవచ్చని, ఈ ఆర్మీని ఎవరో కావాలని నడుపుతున్నారు.

ఈ కౌశల్ ఆర్మీ గురించి కాస్త లోతుగా అధ్యయనం చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బాబు గోగినేని అన్నారు. కౌశల్‌ ఆర్మీ అనేది ఒక బూటకం, కొందరు ఆడుతున్న నాటకంలో మరికొందరు భాగస్వామ్యం అవుతున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లో ఈ రోజు మంచి అనిపించిన వారు రేపు చెడు అవుతారు. అలాంటిది కౌశల్‌కు ఎందుకు బిగ్‌బాస్‌ ద్వారా ఇంత మంది అభిమానులు అయ్యారు అంటూ బాబు గోగినేని ప్రశ్నిస్తున్నారు.

త్వరలోనే కౌశల్‌ ఆర్మీ గురించి తాను కొన్ని ఆసక్తికర విషయాలను నిగ్గు తేల్చుతాను అంటూ బాబు గోగినేని సవాల్‌ విసిరాడు. కౌశల్‌ ఆర్మీ వల్లే బాబు గోగినేని ఎలిమినేట్‌ అయ్యాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.