ముగ్గురు వెళ్ళితే అశుభం అని భావించే హరికృష్ణ పెళ్ళికి నలుగురు వెళ్లకుండా ముగ్గురు కలిసి ఎందుకు వెళ్లారో తెలుసా?

సాధారణంగా చాలామంది మూడు సంఖ్యను అశుభంగా భావిస్తారు .ముగ్గురితో వెళ్తే ముడి పడదు అని మన ఇంట్లో పెద్దవాళ్లు అంటూ ఉంటారు. ఈ విషయాన్ని హరికృష్ణ బలంగా నమ్మేవారట. హరికృష్ణ బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెంట ముగ్గురు ఉండేలా జాగ్రత్తగా ఉండేవారట. హరికృష్ణ మూడు సంఖ్యను అశుభంగా భావిస్తారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని హరికృష్ణ స్నేహితుడు ప్రకాశ్ బాధ పడుతున్నారు. హరికృష్ణ స్నేహితుడు ప్రకాశ్ మాట్లాడుతూ ‘’హరికృష్ణ మూడు సంఖ్యను దురదృష్టంగా భావించేవారనీ, ఎప్పుడు బయటకు వచ్చినా నలుగురితో కలసి వెళ్లేలా చూసుకునేవారని వెల్లడించారు. ఈ రోజు కావలిలో పెళ్లి వేడుకకు వెళదామని హరి తనకు చెప్పారనీ, ఆయన ఫోన్ కాల్ కోసం తాను ఎదురుచూస్తూ ఉన్నానని” తెలిపారు.

ఇంతలోనే హరికృష్ణ మరణవార్త వినాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.ముందు నలుగురం కలసి పెళ్లికి వెళదామని అనుకున్నామనీ, కానీ ఆయన మరో ఇద్దరితో కలసి ఎందుకు బయలుదేరారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ రోడ్లు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది..గతంలో ఎన్టీయార్ రోడ్డు ప్రమాదానికి గురవడం..ఇప్పుడు హరికృష్ణ మృతి చెందిన ప్రాంతానికి సమీపంలోనే తన కుమారుడు జానకి రామ్ మృతి చెందడం ఈ నమ్మకాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఎప్పుడూ నలుగురు ,లేదా ఇద్దరితో ప్రయాణం చేసే హరికృష్ణ తన నమ్మకాన్ని వదిలి ముగ్గురితో ప్రయాణం చేయడం ఈ ప్రయాణంలో హరికృష్ణ మృతి చెందడం నిజంగా బాధాకరం.