తన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణం తెలుగునాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోడ్డు ప్రమాదం కారణంగానే ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ మరణించగా, ఇప్పుడు తాను సైతం రహదారి రక్తదాహానికే బలయ్యారు. అంతకుముందు చిన్నకొడుకు జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ లో తీవ్రగాయాలతో బయటపడ్డాడు. తండ్రి మరణంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కుంగిపోయాడు. తల్లి, తండ్రి అంటే ఎంతో ప్రాణంగా చూసుకునే తారక్ ను ఇప్పుడు ఎవరు కదిలించినా కన్నీళ్లు వెల్లువలా వస్తున్నాయి.

ఓదార్చడానికి వస్తున్న ఆత్మీయుల వద్ద భోరున విలపిస్తూ తండ్రి పోయిన బాధలో తల్లడిల్లిపోతున్నాడు nTR. నాన్నకు ప్రేమతో షూటింగ్ సమయంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ… మా నాన్నకు ఏమైనా జరుగుతుంది అనుకుంటే నేను అస్సలు ఊహించుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. కానీ మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడడంతో తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ కుమిలిపోతున్నాడు. అయితే డ్రైవర్ ఉండి ఉంటే నందమూరి హరికృష్ణకు ఈ ప్రమాదం జరిగేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కొన్నాళ్ల క్రితం ఆయనకు పర్సనల్ డ్రైవర్లు ఉండేవాళ్లు. అయితే ఆయన వాళ్లకి ఒక సంవత్సరం జీతం ముందే ఇచ్చేసి పంపించేశారు. స్వయంగా డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఆయన తన డ్రైవింగ్ మోజు కోసం డ్రైవర్లను కూడా పెట్టుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు గతంలో ఓసారి యాక్సిడెంట్ అయింది.

అయినా ఇప్పటికీ తన వాహనాన్ని తానే నడుపుకుంటాడు. కానీ ఇప్పుడు తండ్రి మరణంతో ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకమీదట తన కారుకు ప్రత్యేకంగా డ్రైవర్ ను నియమించుకోవాలని భావిస్తున్నాడట. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఇదే సలహా ఇచ్చారట.

ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటే రిస్క్ తీసుకునే అవకాశం తగ్గుతుందని, షూటింగ్ ఒత్తిళ్ల కారణంగా అలసిపోయిన స్థితిలో డ్రైవింగ్ చేయడం కంటే డ్రైవర్ ను పెట్టుకుంటే మేలని సూచించారట. ఎన్టీఆర్ కూడా వాళ్లు చెప్పిన మాటలకు ఆమోదం తెలిపినట్టు సమాచారం.