తండ్రి,కొడుకులిద్దరిని బలి తీసుకున్నహరికృష్ణ కార్ నంబర్ గురించి నమ్మలేని నిజాలు

గతంలో యంగ్ టైగర్ భారీ రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇపుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ మూడు ప్రమాదాలు ఒకే జిల్లాలో జరగటంతో నందమూరి అభిమానులు నందమూరి కుటుంబానికే ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆందోళన చెందుతున్నారు. అయితే హరికృష్ణకి యాక్సిడెంట్ జరిగిన కార్ నెంబర్ పై ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

హరికృష్ణకు ముగ్గురు కుమారుల్లో జానకి రామ్ అంటే కాస్త ఎక్కువ ఇష్టం. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కన్నా జానకిరామ్ మీద కాస్త ఎక్కువ ప్రేమ ఉండటంతో జానకిరామ్ చనిపోయిన తర్వాత అతని కారు నంబరుతోనే తన కొత్త కారుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు హరికృష్ణ. 2014లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకి రామ్ కన్నుమూశారు.

ఆయన ప్రయాణించిన కారు నెంబర్ ఏపీ29 బీడీ 2323. కుమారుడు మరణించిన తర్వాత అతనిపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఏపీ28 బీడబ్ల్యూ 2323 పేరుతో ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. కొడుకు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఇపుడు ఆ నంబరే హరికృష్ణ ప్రాణాలు తీసిందని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు, తండ్రీకొడుకులిద్దరూ అదే నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు.