ఆ యువకుడు డ్రైవర్ గా వచ్చి ఉంటే… కానీ ఆ యువకునికి హరికృష్ణ పెట్టిన షరతులు ఏమిటో తెలుసా?

ఎన్టీఆర్ కొడుకు హీరో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదం నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగింది. కారు వేగంగా వెళ్ళటం వలన అదుపు తప్పి బోల్తా పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకువెళ్లిన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మరో మూడు రోజుల్లో (సెప్టెంబర్‌ 2) తన పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ ఇలా అర్థాంతరంగా మృతిచెందటంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

ఈ ప్రమాదానికి కారు అతి వేగంగా నడపటం మరియు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అని తెలుస్తుంది. అసలు హరికృష్ణ కారుకి డ్రైవర్ ని ఎందుకు పెట్టుకోలేదనే అనుమానాలు అందరికి వచ్చాయి. అయితే హరికృష్ణ డ్రైవర్ కోసం అన్వేషణలో ఉన్నట్టు సమాచారం. 15 రోజుల క్రితమే హరికృష్ణ మంచి డ్రైవర్ కావాలని బోధన్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఎం.అమర్‌నాథ్‌బాబుకు చెప్పారట.

అయన హరికృష్ణ వద్దకు ఒక యువకున్ని పంపారట. హరికృష్ణ అతని బయో డేటా తీసుకోని పంపించేసారట. హరికృష్ణ అతని జాతకాన్ని చూపించి జాతకం బాగుందని భావించి ఆ యువకున్ని మరల పిలిచారట. హరికృష్ణ ఆ యువకుడికి కొన్ని కండిషన్స్ పెట్టారట.
Actor Nandamuri Harikrishna
ప్రతి రోజు తనను ఇంటి వద్ద దింపాక హోటల్‌లోనే పడుకోవాలని, హైవేపై వంద కిలో మీటర్లు, సిటీలో 80 కిలో మీటర్లలోపు వేగంతోనే వెళ్లాలని చెప్పారు. ఈ షరతులకు లోబడి ఉంటానంటే డ్యూటీలో చేరాలని సూచించారు. ఆ యువకుడికి హరికృష్ణ పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో మళ్లీ రాలేదు. ఒకవేళ ఆ యువకుడు హరికృష్ణకు డ్రైవర్ గా వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అమర్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు.