Devotional

సాయంత్రం వేళ ఈ పనులను చేస్తే లక్ష్మి దేవి ఆగ్రహానికి గురి కాక తప్పదు… ఆ పనులు ఏమిటో తెలుసుకోండి

పూర్వం మన పెద్దలు ఎన్నో నియమాలను,కట్టుబాట్లను,సంప్రదాయాలను పెట్టి ఆచరిస్తున్నారు. వాటి మీద నమ్మకం ఉన్నవారు పాటిస్తున్నారు. నమ్మకం లేనివారు పాటించటం లేదు. అయితే మన ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఆలా చేయకూడదు,ఆలా చేయాలి అంటూ కొన్ని నియమాలను చెప్పుతూ ఉంటారు. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము. కానీ మన అలవాట్ల కారణంగా లక్ష్మి దేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందువల్ల ఆమె ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి. మన హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మి దేవిని సంతోషపెడితే ఆమె మనకు అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. సంపద,శ్రేయస్సు కావాలంటే లక్ష్మి దేవి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి.

ఆమె అనుగ్రహం ఉంటే సంపద పుష్కలంగా ఉంటుంది. మీకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు మీ ఆర్ధిక పరిస్థితిని,అదృష్టాన్ని తలకిందులు చేస్తుంది. మీకు శాస్త్రాల మీద నమ్మకం ఉంటే కనుక కొన్ని నియమాలను పాటించాలి. మీకు ఉన్న చిన్న చిన్న అలవాట్లే లక్ష్మి దేవికి ఆగ్రహాన్ని కలిగించి దురదృష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆ అలవాట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

సాయంత్రం తులసిని పూజించకూడదు.హిందూ సంప్రదాయం ప్రకారం సాయంత్రం సూర్య అస్తమయం అయ్యాక తులసిని పూజించటం,ముట్టుకోవటం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. అయితే తులసికి నీళ్లు పోయటం,పూజ చేయటం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అయితే సాయంత్రం మాత్రం పూజ చేయకూడదు. కానీ సూర్య అస్తమయం అయ్యాక తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించవచ్చు. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మి దేవిని ఆకర్షిస్తుంది.

సూర్య అస్తమయం అయ్యాక చెత్త ఉడవ టాన్ని అపవిత్రముగా భావిస్తారు. సూర్య అస్తమయం తర్వాత చెత్త ఉడవటం వలన మీ అదృష్టాన్ని,సంతోషాన్ని ఉడ్చినట్టు అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారుగా… సాయంత్రం సమయంలో చెత్త ఊడవకండి.

సాయంత్రం సమయంలో నిద్ర పోకూడదు. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా పెద్దగా పట్టించుకోరు. సాయంత్రం సమయంలో పడుకోవటం వలన దురదృష్టం మరియు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాక సాయంత్రం సమయాల్లో పడుకోవటం వలన అధిక బరువు సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఆహారం తిన్నా వెంటనే పాత్రలను శుభ్రం చేయకపోతే శని దృష్టి మీ మీద పడుతుంది. ఆహారం తిన్నా వెంటనే పాత్రలను కడగటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద,శ్రేయస్సు వస్తాయి.

సూర్య అస్తమయం సమయంలో చదువుకోకూడదు. ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. పురాణాల ప్రకారం సాయంత్రం సమయంలో చదువుకుంటే లక్ష్మి దేవి ఆగ్రహిస్తుందట. ఆ సమయంలో ఆటలు ఆడుకోవటం చాలా మంచిది. ఆ సమయంలో చదువుకోవటం కన్నా ఆటలు ఆడుకోవటం వలన మానసిక,శారీరకంగా బాగుంటారు.

లక్ష్మి దేవి అనుగ్రహం ఉన్న ఇల్లు సంపదతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. అందువల్ల లక్ష్మి దేవికి ఆగ్రహం కలిగించే పనులను చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
Click Here To Follow Chaipakodi On Google News