గణేష్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కౌశల్….. ఆ అఫర్ ఏమిటో తెలుసా?

బిగ్ బాస్ రియాల్టీ షో సెకండ్ సీజన్ మరికొన్నివారాల్లో ముగియనుంది. అసలు బిగ్ బాస్2 మొదలయ్యే సమయంలోనే చెప్పారు ఏదైనా జరగొచ్చని. ఆ ట్యాగ్ లైన్ కు న్యాయం చేస్తూ ఇప్పటివరకు ఎవరూ ఫేస్ చేయనన్ని నామినేషన్లు ఎదుర్కొన్న కామన్ మ్యాన్ గణేష్ ఎలిమినేట్ అయ్యాడు. మొదట్లో చాలా సైలెంట్ గా ఉన్న గణేష్ మధ్యలో కాస్త పికప్ అయినట్టు కనిపించాడు. కానీ గత రెండు మూడు వారాలుగా అతని గేమ్ మరీ నిదానించింది. దానికి తోడు మైక్ బ్యాటరీలు తీసి మరీ తన అసహనాన్ని ప్రదర్శించడం బిగ్ బాస్ టీమ్ నే ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పట్నించే గణేష్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టు భావించాలి. అంతేకాకుండా టాస్క్ ల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం మైనస్ అయింది.

బయట ఆడియన్స్ కూడా గణేష్ గేమ్ పట్ల బోర్ ఫీలవుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. ఇక అందరూ ఊహించినట్టుగానే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో మొదట గణేష్ ను ఎలిమినేట్ చేస్తున్నట్టు నాని చెప్పాడు. బిగ్ బాస్ నిర్ణయంతో గణేష్ షాక్ తిన్నట్టు కనిపించాడు. అయితే వెంటనే తేరుకుని హౌస్ మేట్స్ తో ఎంతో భారంగా మాట్లాడాడు.

ఈ సందర్భంగా కౌశల్ తీవ్ర భావోద్వేగాలకు గురవడం కనిపించింది. ఎలిమినేషన్ కు గురయ్యానన్న ఆవేదనలో ఉన్న గణేష్ ను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. ఓ సోదరుడిలా గణేష్ ను కౌశల్ ఓదార్చడం ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. సెండాఫ్ సమయంలో కూడా గణేష్ ను ఆప్యాయంగా హత్తుకుని మనస్ఫూర్తిగా సాగనంపాడు.

ఇక అన్ సీన్ ఫుటేజ్ లో గణేష్ తో కౌశల్ పర్సనల్ గా మాట్లాడడం కనిపించింది. నటన అంటే ఇంట్రస్ట్ ఉందన్నావు కాబట్టి సినిమాల్లో ప్రయత్నించు… అక్కడ చాన్సులు దొరక్కపోతే నాకు కాల్ చేయ్… టెలివిజన్ రంగం నుంచి మొదలుపెట్టే అవకాశం కల్పిస్తాను…ఇప్పుడు టెలివిజన్ ఫీల్డ్ కూడా సినిమా రేంజ్ కు ఎదుగుతోంది… అక్కడ క్లిక్కయితే సినిమాల్లోకి రావడం చాలా ఈజీ అవుతుంది… అంటూ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.