ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ తీసుకున్న సంచలన నిర్ణయానికి షాక్ తిన్న టాలీవుడ్

ఎన్టీఆర్ తండ్రి సినీ నటుడు రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరణం నుంచి తెలుగు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకున్న, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా ఆ విషాదం నుంచి బయట పడలేదు. మరియు అయన జ్ఞాపకాలను మర్చిపోలేక తీవ్రంగా కుమిలిపోతున్నారు. ఊహించని హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నారు. అయితే ఈ సమయంలో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ తీసుకున్న సంచలన నిర్ణయం ఒక వైపు టాలీవుడ్ మరో వైపు అభిమానులను షాక్ కి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళ్ళితే, ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మాతగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అరవింద సమేత అనే ఫ్యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది.

అయితే హరికృష్ణ మరణంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఓ వైపు నిర్మాత ఈ సినిమాకోసం కోట్ల రూపాయల ఖర్చుతో సెట్ ప్రాపర్టీస్ తీసుకున్నారు. దాంతో తన కారణంగా నిర్మాతకు నష్టం వాటిల్లకూడదని భావించిన జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ కు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయాన్నీ నిర్మాతకు,దర్శకుడికి తెలిపాడట ఎన్టీఆర్. నిర్మాతకు నష్టం వాటిల్లకూడదని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఒక వైపు తండ్రి మరణం కృంగదీస్తున్న మరో వైపు నిర్మాత శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి చితా పరిశ్రమ పెద్దలు శబాష్ అంటున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ కూడా కేవీ గుహన్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లు. మహేష్ కోనేరు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కూడా నందమూరి హరికృష్ణ మరణంతో నిలిచిపోయింది.

కొండంత అండగా ఉండే తండ్రి పోయిన బాధను కూడా దిగమింగిన కల్యాణ్ రామ్ షూటింగ్ ప్రారంభిచాలని చిత్ర యూనిట్ కు ఇన్ఫామ్ చేశారట. సెప్టెంబర్ 3 నుంచి ఆయన షూటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకోవడం పట్ల అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.